Wednesday, 28 May 2014

ఆమె ఓ స్వరం- సర్వస్వం

ఆమె ఓ స్వరం- సర్వస్వం


- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
22.03.2014

చిత్ర స్వర విన్యాసం 
సరస్వతీ లాస్యం
పాటల ప్రవాహం
కనిపించదు భేషజం
లేదు భాషా బేధం
కట్టుబొట్టులో భారతీయం
అమె ఎవరెస్టు శిఖరం
ఆమె ఓ నీలిమేఘం..
ఆ సరిగమకాలలో
ఎన్ని హొయలో
ఆ రాగసరాగాలలో
ఎన్ని లయలో
ఆ అలివేణీవాణిలో
ఎన్ని జతులో..
ఆ పదపలుకులులో
ఎన్ని కులుకులో
అమె స్వరసర్వస్వం..
అమె ఓ సంధ్యాసమీరం


చిత్ర్రాల్లో చిత్రంగా తెలుగు గూడుచేరి
తెలుగు మనసుల్లో మ్రోగించే భేరీ..
తొలి పాటకు పల్లవి పాడి
పండితపామరుల చెంతనే చేరి
పల్లవి పలికించే..వాగ్ధేవి
అచ్చంగా తెలుగింట 
అడపడుచై వెలిగెనేని
ఆమె నిత్య శుభంకరి
ఆమె ఓ సంగీత ఝరి..
చిత్రమ్మా నీకు సంగీతవందనాలమ్మా..!

No comments:

Post a Comment