Wednesday, 28 May 2014

కన్నీటి నివాళి

కన్నీటి నివాళి

కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
16.03.2014

పొ గడెద నిన్ను కలి రామాయని గ
ట్టి మేల్ తలపెట్టి భాషకు పట్టము గట్టి
'శ్రీ' లు నిస్సిగ్గుగ సిగ్గుపడేలా ప్రాణమర్పంచి 
రా ష్ట్రము తెచ్చితివేని.. ఆత్మగౌరవమ్ము చాటంగ
ము దిమి లెక్కించక యాబది ఎనిమిది దినములు ఆ-
లు బిడ్డలు గతించ లెక్కచూడక..రాష్ట్రము కై
అన్నపానము మాని .. అమరజీవివయ్యావయా..
దిక్కులు పిక్కటిల్లగా.. కన్నీరు వరదలవ్వగా
తెలుగు జాతి యావత్తు.. చేష్టలుడగగ...
నీదు త్యాగఫలముగ రాష్ట్రమవతరించె..
నీవు తిరిగిరాకు మహాశయా..!
నీ ఫలమిప్పుడే..ముక్కలాయెను
నిన్ను తలచిన నాధుడే కరువాయెను.
నీకిదే అమరేంద్రుడా...నా కైమోడ్పు
నీపాదములనర్చించ నా కన్నీళ్ళు చాలవెపుడూ
నీవె కదా జాతి యవత్తుకూ దార్శనికుడు.

 

(రాష్ట్రం విభజనకు గురైన అనంతరం వచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 113 వ జయంతి ని పురస్కరించుకుని.. వ్రాసినది... మొదటి అక్షరాలలో అమరజీవి పేరును ప్రస్తావించడం జరిగింది గమనించగలరు)

No comments:

Post a Comment