సూరీడొస్తున్నాడ్రోయ్..
-----------------
-----------------
సూరీడు.. దూసుకుని పైకొస్తున్నాడు..
మబ్బుల్ని మెడబెట్టి నెట్టి..
మబ్బుల్ని మెడబెట్టి నెట్టి..
సూరీడొస్తున్నాడ్రోయ్..
సుర సుర సుయ్ మంటున్నాడు..
నాలోని స్వేదాన్ని జుర్రుకునేందుకు..
నా బుర్రకు వేడిపుట్టీంచేందుకు..
నాలో చిరాకు రగిలించేందుకు.
సుర సుర సుయ్ మంటున్నాడు..
నాలోని స్వేదాన్ని జుర్రుకునేందుకు..
నా బుర్రకు వేడిపుట్టీంచేందుకు..
నాలో చిరాకు రగిలించేందుకు.
నా పనిని అడ్డుకునేందుకు..
నామంట మండించేందుకు..
నా అందం మింగేసేందుకు..
నాకు నిలువ నీడలేకుండా చేసేందుకు.
నామంట మండించేందుకు..
నా అందం మింగేసేందుకు..
నాకు నిలువ నీడలేకుండా చేసేందుకు.
********
సూరీడు.. చల్లగా పైకొస్తున్నాడు..
మబ్బుల్ని మెల్లగ నెట్టి..
మబ్బుల్ని మెల్లగ నెట్టి..
సూరీడొస్తున్నాడ్రోయ్..
చకచకా..చకచక.. చలాకీగా ఏడుగుర్రాలపై
నాటోపీలమ్మేందుకు..
నా గొడుగులు ధరించేందుకు..
నా ఐస్ క్రీం లాగించేందుకు
చకచకా..చకచక.. చలాకీగా ఏడుగుర్రాలపై
నాటోపీలమ్మేందుకు..
నా గొడుగులు ధరించేందుకు..
నా ఐస్ క్రీం లాగించేందుకు
నా జ్యూస్ లు జుర్రుకునేందుకు
నా బోండాం లు పూర్తిచేసేందుకు
నా చెరుకురసం పీల్చేందుకు..
నా జేబులు నింపి.. నను ముందుకు నడిపేందుకు..
నా కడుపు నింపేందుకు..!
నా బోండాం లు పూర్తిచేసేందుకు
నా చెరుకురసం పీల్చేందుకు..
నా జేబులు నింపి.. నను ముందుకు నడిపేందుకు..
నా కడుపు నింపేందుకు..!
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
11.04.2014
11.04.2014
No comments:
Post a Comment