లోకాలు ఎన్ని ?ఏవి ?
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
14.04.2014
మాలోకం.. మా లోకం
ఎవర్రా ఈ పిచ్చి మాలోకం..
లోక సమస్తా సుఖినో భవంతు..
ఆలోక యే శ్రీ బాల కృష్ణం..
లోక సమస్తా సుఖినో భవంతు..
ఆలోక యే శ్రీ బాల కృష్ణం..
అవును ఈ లోక ఎక్కడి పదం.. హిందూ సంస్కృతిలో పురాణాలలోని అధర్వణ వేదంలో లోక అనే పదం వాడబడింది.. లోక అనే పదం నుండి లోకం అనే భావన ఏర్పడింది. సంచార జీవుల వల్ల లోకం అంటే.. ప్రదేశం, ప్రపంచం అనే అర్ధం స్థిర పడింది. కానీ వేద సంస్కృతి ప్రకారం లోక్ అంటే మానసిక స్థితి యొక్క స్థానము. అంటే.. మన మనసే మరో లోకాన్ని ప్రతిబింబిస్తుందన్నమాట..! మరి ఆ లోకాలు ఎన్ని అవి ఏవి అన్న విషయం చాలామందికీ తెలిసినా... చాలామందికీ తెలియక పోవచ్చు.. తెలిసిన వాళ్ళు తెలియని వారికి చెప్పాలి.. కానీ చెప్పరు.. అందుకే నేను తెలుసుకుని తెలియని వారికి చెబుదామనుకున్నా... తెలిసిన వాళ్ళకి మరొకసారి గుర్తుచేద్దామని తపిస్తున్నా..!
ఇంతకీ అధర్వణ వేదం ప్రకారం
మొత్తం పదునాల్గు భువనాలు..అంటే పద్నాలుగు లోకాలన్నమాట.! మధ్య నుంచి పైకి ఏడు లోకాలు ఊర్ధ్వలోకలు అంటారు.. మధ్య నుంచి క్రిందకు అధో లోకాలు అంటారు. అవి ఏడు.. ఇవి ఏడన్నమాట. అంటే మనిషి మానసికం గా ఎదిగితే ఏడింతలు ఎదగొచ్చు.. మనసికంగా కృశించి పోవడం మొదలైతే ఏడింతలు తరిగిపోవచ్చని ఆ వేదఘోషలోని లోకాల శబ్ధ భావన.
వాటి పేర్లు తెలుసుకుందాం.....
వాటి పేర్లు తెలుసుకుందాం.....
ఊర్ధ్వలోకాలు
1. సత్య లోకం
2. తప లోకం
3. జన లోకం
4. మహర్లోకం
5. సువర్లోకం
6. భువర్లోకం
7. భుర్లోకం
2. తప లోకం
3. జన లోకం
4. మహర్లోకం
5. సువర్లోకం
6. భువర్లోకం
7. భుర్లోకం
అధో లోకాలు
8. అతల లోకం
9. వితల లోకం
10. సుతల లోకం
11. తలాతల లోకం
12. మహాతల లోకం
13. రసాతల లోకం
14. పాతాళ లోకం
9. వితల లోకం
10. సుతల లోకం
11. తలాతల లోకం
12. మహాతల లోకం
13. రసాతల లోకం
14. పాతాళ లోకం
అదండీ సంగతి..! చెప్పిన మాట వినకపోతే పాతాళానికి జారిపోతావ్ అని గురువుగారంటారు గుర్తొచ్చిందా..! మరి జాగ్రత్త సుమ్మీ..!
ఇంతకీ మనమెక్కడున్నామబ్బా..?? మా లోకం.. ఏది మన లోకం ??
లోక సమస్తా సుఖినో భవంతు..!!!
లోక సమస్తా సుఖినో భవంతు..!!!
మిత్రమా ఏడవ లోకం నీవు తప్పుగా రాసావు.
ReplyDeleteఎడవది భూలోకం
అధో లోకాలు
1.అతలం (పాదాలు)
2. వితలం (మడమలు)
3. సుతలం (జంఘాలు)
4.రసాతలం (జానువులు)
5. మహాతలం (ఊరువులు)
6. తలాతలం (కటి)
7.పాతాళం (నాభి పైభాగం)
ఊర్ధ్వలోకాలు
1.సత్యలోకం (శిరస్సు)
2.తపోలోకం (భ్రూమధ్యం)
3.జనోలోకం (ముఖం)
4.మహర్లోకం (కంఠం)
5.స్వర్లోకం (వక్షం)
6.భువర్లోకం (జఠరం)
7.భూలోకం (నాభి)
తప లోకం గురించి వివరణ కావాలి
ReplyDelete