నువ్వంటే నాకు మనసవ్వదు
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
27.03.2014
కలికి చిలకల కొలికి..
తెలుగు పన్నీరు చిలికి
దగ్గరయ్యేరు కదా అందరికీ
తెలుగు పన్నీరు చిలికి
దగ్గరయ్యేరు కదా అందరికీ
ఎన్నాళ్ళ నిరీక్షణో..
ఆమె అడుగుల తాకిడికే
మురిసిన ప్రకృతి పరవశించె..
కొమ్మను విడిచిన లతాంగి
అమె స్పర్శ కోసం తపించె
ఆమె కాలి అందెల సవ్వడికి
సంబరపడి తోక పిట్ట చిందిలేసె
ఆమె మాటల సద్దుకు కొమ్మల్లో
దాగున్న కోయిలమ్మ ప్రతిధ్వనించె..
ఆమె అడుగుల తాకిడికే
మురిసిన ప్రకృతి పరవశించె..
కొమ్మను విడిచిన లతాంగి
అమె స్పర్శ కోసం తపించె
ఆమె కాలి అందెల సవ్వడికి
సంబరపడి తోక పిట్ట చిందిలేసె
ఆమె మాటల సద్దుకు కొమ్మల్లో
దాగున్న కోయిలమ్మ ప్రతిధ్వనించె..
అందాల బరిణె రాకకు...
చెట్లన్నీ ఒంగి స్వాగతం పలికె
కానాంతా కమ్మని సుగంధాలు పరిచె
ఎండిన జలపాతం.. ఆనంద భాష్పాలు రాల్చె..
నిశబ్ధం ఆవరించిన.. నిశీధిలో
ఉషాకిరణాలు చొచ్చుకునొచ్చి అమె స్పర్శించి తరించె
ముగ్గురమ్మలమూలపుటమ్మ .. పండగ సారె అందించె
చెట్లన్నీ ఒంగి స్వాగతం పలికె
కానాంతా కమ్మని సుగంధాలు పరిచె
ఎండిన జలపాతం.. ఆనంద భాష్పాలు రాల్చె..
నిశబ్ధం ఆవరించిన.. నిశీధిలో
ఉషాకిరణాలు చొచ్చుకునొచ్చి అమె స్పర్శించి తరించె
ముగ్గురమ్మలమూలపుటమ్మ .. పండగ సారె అందించె
ఒక్కపూటలో ఎంతటి పారవశ్యం...
ఒక్క ఝాములో ఎంతటి రమణీయం..
ఒక్క పొద్దులో ఎంతటి విలాసం..
ఒక్క ఝాములో ఎంతటి రమణీయం..
ఒక్క పొద్దులో ఎంతటి విలాసం..
అవును అడవమ్మ నవ్వింది.. అనందం పొంగగా..
కోయిలమ్మ పిలిచింది.. తలపు సంతసించగా..
ఎక్కడో నెమలి పురివిప్పి నాట్యమాడే వుంటుంది..
ఎందుకంటే అక్కడికి తరలి వచ్చె వసంతం తానై
కోయిలమ్మ పిలిచింది.. తలపు సంతసించగా..
ఎక్కడో నెమలి పురివిప్పి నాట్యమాడే వుంటుంది..
ఎందుకంటే అక్కడికి తరలి వచ్చె వసంతం తానై
హృదయాంతరాళలో గూడుకట్టుకున్న
ఏనాటి అనుబంధమో..
ఆమె వెనుదిరగగానే ..
చల్లగాలి ఒక్కసారిగా నిలిచిపోయింది..
వనం మూగగా రోదించింది.
తోకపిట్ట రెక్క తెగినట్ట్లు విలవిల్లాడింది.
సూరీడు ఆవేదనతో నడినెత్తిన శివతాండవం మొదలెట్టాడు..
ఏనాటి అనుబంధమో..
ఆమె వెనుదిరగగానే ..
చల్లగాలి ఒక్కసారిగా నిలిచిపోయింది..
వనం మూగగా రోదించింది.
తోకపిట్ట రెక్క తెగినట్ట్లు విలవిల్లాడింది.
సూరీడు ఆవేదనతో నడినెత్తిన శివతాండవం మొదలెట్టాడు..
ఆమె ఓ అద్బుతం
సంగీత సాహిత్యాల సమరూపం
ఆమె ఓ వెన్నెల
వెలుతురు పంచే దివ్యరూపం
అమె నవ్వుల జలపాతం
చిరునవ్వులు చిలికించే సరోవరం
అమె తెలుగు చదువుల దేవాలయం
బీజాక్షరాలు లిఖించు వాగ్ధేవి రూపం
సంగీత సాహిత్యాల సమరూపం
ఆమె ఓ వెన్నెల
వెలుతురు పంచే దివ్యరూపం
అమె నవ్వుల జలపాతం
చిరునవ్వులు చిలికించే సరోవరం
అమె తెలుగు చదువుల దేవాలయం
బీజాక్షరాలు లిఖించు వాగ్ధేవి రూపం
అమె వెనుదిరిగితె అడవే అల్లాడితే..
మా మనసులు పిక్కటిల్లవా..?
ఆ బాధ మా హృదయాన్ని పిండదా??
ఆ గాయం మా మదిని తొలచదా??
తెలుగు లేకుండా మమ్మూహింపగలరా??
మా మనసులు పిక్కటిల్లవా..?
ఆ బాధ మా హృదయాన్ని పిండదా??
ఆ గాయం మా మదిని తొలచదా??
తెలుగు లేకుండా మమ్మూహింపగలరా??
అందుకే దైవమా నీవంటే నాకు మనసవ్వదు..
ఎక్కడ నుండి మరెక్కడికో..
ఇంతలో కలిపేవు.. అంతలోదూరం చేసేవు..
మనసులతో పరిహాసాలాడేవు..
మమతలను దూరంగా విసిరేవు..
స్నేహాన్ని క్షణభంగురం చేసేవు..
ఎందుకిలా..? ఏమిటి నీ లీలలు
మనుషులతో నీ క్రీడకు ఇకనైనా స్వస్తిపలకవూ..!!
ఎక్కడ నుండి మరెక్కడికో..
ఇంతలో కలిపేవు.. అంతలోదూరం చేసేవు..
మనసులతో పరిహాసాలాడేవు..
మమతలను దూరంగా విసిరేవు..
స్నేహాన్ని క్షణభంగురం చేసేవు..
ఎందుకిలా..? ఏమిటి నీ లీలలు
మనుషులతో నీ క్రీడకు ఇకనైనా స్వస్తిపలకవూ..!!
No comments:
Post a Comment