Wednesday 28 May 2014

'పద' నిసలు

'నడుము కలిసిన నవరాత్రి.. సిగ్గుపడితే శివరాత్రి.. అభీభీ..అభీభీ..'
పాట గమనించారా..! ఇదీ రచయిత ముందు రాసిన పల్లవి.. తర్వాత దర్శకుడు..నిర్మాత ఖంగారుపడి.. పాటల రచయిత అసిస్టెంట్ కు ఫోన్ చేసి బాబూ పెద్దయనకు చెప్పండి.. సెన్సార్ ప్రాబ్లెం రావొచ్చు.. పాట మార్చాలని కోరారట. ఆ విషయం ఆసిస్టెంట్ ద్వారా తెలుసుకున్న ఆ రచయిత.. నడుము బదులు..' నడక ' మార్చి పంపమని చెప్పారట.. ఎంత మారిపోయిందో కదా అర్ధము.. తెలుగుభాష సొబగు అదేనేమో కదా.. !
ఇక ఒకసారి లెక్కల్లోకి వెళ్దాం... n! అనే ఫార్ములా గుర్తుందా?? 3! అంటే..3x2x1= 6 అంటే.. ఆరు సంయోగాలు వ్రాయవచ్చు. (permutations &Combinations)
. కానీ. తెలుగులో చూడండి నా సామిరంగా.. వ్రాస్తుంటే.. వస్తూనే ఉంటాయి..

అలాగే ఒక చిన్న అజింతాన్ని(ఇంగ్లీషును తెలుగులో కలిపేసుకున్న పదం). కేవలం గుణింతాలు ఒత్తుల సహకారం తో ఎన్ని పదాలు రాయవొచ్చో చూద్దామా..? సో తెలుగు + లెక్కలు ...
పదము - అర్ధము / వాడబడే వాక్యము
----------------------------------
నవల - నావెల్(అంగ్లం)
'నవ'ల - తొమ్మిది రసాలు నిక్షిప్తమైనది 
'నవ'ల - కొత్తదనం కలిగినది
నవ్వల - నవ్వలేదు
నవ్వేలా- నవ్వేవిధంగా
నవ్వాలా- నేను నవ్వాలా (మీ కుళ్ళు జోక్ కు?)
నవ్వలే - ఎన్ని జోక్ లు వేసినా అమె నవ్వలే(దు)
నవలా- నేను మీరిచ్చిన పదార్ధము నవలను
నవల్లా - వారు మీరిచ్చిన పదార్ధము నవలలేదు
నా వల - నాయొక్క వల
నా వల్ల - నా చేత
నాలవ - నా లవము
నాలవ్వా - నా ప్రేమా?
నా వెల్ (తెంగ్లీష్) - నా బావి
వెల్లనా - వెళ్ళనా??
ఇవి కేవలం మూడు అక్షర సుమాలతో అల్లినవి మాత్రమే.. ఆయా మూడు అక్షరాల ఒత్తులను గుణింతాలను మాత్రమే వాడి ప్రయోగించినవి.. కొద్దిగా ప్రక్కకు జరిగి.. వేరే ఒత్తులను పెట్టడం మొదలెడితే.. మరెన్నో పదాలు వచ్చి వాలతాయ్..
ఉదా: నాల్గవ,,నావర్ల(తమిళ్)
ఇలాంటి పదాలను మీరు గమనిస్తే. పంచుకోవచ్చు,,వెంటనే మీ గోడ మీద పిడకేయండి..

No comments:

Post a Comment