అక్షర దీపం
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
దీ ర్ఘాలు, హ్రస్వాలు ,అచ్చులు హల్లులు
అజ్ఞాన సుషుప్తి నుంచి
మేల్కొలిపే ఉదయ కిరణాలు..
సరిగమలు సంగీత స్వరజతి కి
ప్రాణం బొసగే సుస్వర నాదమాలికలు..
కార్యేషు.. కరణేషు..సర్వదా
అక్షరములే కదా సాధనములు
అజ్ఞాన సుషుప్తి నుంచి
మేల్కొలిపే ఉదయ కిరణాలు..
సరిగమలు సంగీత స్వరజతి కి
ప్రాణం బొసగే సుస్వర నాదమాలికలు..
కార్యేషు.. కరణేషు..సర్వదా
అక్షరములే కదా సాధనములు
పుడమిని,హృదిని పులకింపజేసే శబ్ధ భేరీలు..
ఒట్టి...మాలోకాలకు.. మట్టి పామరులకు
నది లాంటి నీవే కదా... ఆధారము...సర్వము
రోజూ పూచే రోజాలాంటి..మకరంద భూషితమా..
జున్ను మీగడలాంటి.. మాధుర్య నిక్షిప్తమా..!
ఒట్టి...మాలోకాలకు.. మట్టి పామరులకు
నది లాంటి నీవే కదా... ఆధారము...సర్వము
రోజూ పూచే రోజాలాంటి..మకరంద భూషితమా..
జున్ను మీగడలాంటి.. మాధుర్య నిక్షిప్తమా..!
వెలుగు బ్రతుకుకు బంధమా..
భవిష్య భారతానికి..జీవమా..
కర్ణపేయమా..నయన కమనీయమా..!
అచ్చంగా తెలుగు అక్షరమా..!
నీకు వందనం.. అభినందనం..!!
No comments:
Post a Comment