Wednesday 28 May 2014

మన బడి..

మన బడి..


- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
24.03.2014

మధురజ్ఞాపకాల లోగిలి..
అనుబంధాల కౌగిలి..
అనుభూతుల వాకిలి..
ఆలయాలకే ఆలయం
అడుగిడగానే పొంగే మదిసంతసం

సెలఏటి గలగలలు..పచ్చదనం జాడలు
అమ్మా..అమ్మా..ఆవు..ఆవు
రెండొకట్లరెండు.. రెండ్రెళ్ళు నాలుగంటూ
సంగీత సాధననను తలపించే
అరుపుల ప్రతిధ్వనులు..

కష్టాన్ని కొలిచి చూపే
పుస్తకాల బండమోతలు..
దేశభక్తితి గుండే ఉప్పొంగగ
నామాతృభూమి ప్రతిజ్ఞా,ప్రార్ధనా గీతాలు

స్వేచ్చా విహంగాలై
అల్లరి రిని హత్తుకున్న కేరింతలు

శిల్పంగ మలచే ఉలిదెబ్బలైన
మాస్టారి దెబ్బలు తప్పించుకునే పాట్లు

మనసంత విశాలమైన..
ఆటస్థలంలో ఒంగుళ్ళు దూకుళ్ళు.. 
కుందుడు గుమ్మలు, 
పిచ్చాపాటిలు, గిల్లికజ్జాలు

ఇసుకతెన్నెలపై పిచుక గూళ్ళు
తొండి మాటలు.. ఖటీఫ్ చేతలు
బుంగమూతులు..కౌగిలింతలు.. 

రణగొణ ధ్వనులకు నిశబ్ధం ఆవరించి
అందరినీ స్వరాలు ఒక్క త్రాటీమీద నిలబెట్టే 
వందేమాతర - జనగణమణ దేశభక్తి ఆలాపనలు
జైహింద్...వెనువెంట ఉరుకులు పరుగులు..

ఆ రోజులు సుధామధురం...
ఆహా ఆ గాలి సుగంధ భరితం..
ఆ శబ్ధం సుస్వరాల సమ్మోహనం..
ఆ గురువులు కామధేనువుల రూపం..
ఆ స్నేహితులు జన్మజన్మల బంధనం..
మధురం.. మధురం ..
చిన్ననాటి పాఠశాల జ్ఞాపకం..
తిరిగిరాని రోజుల ఆనందనందనం.!!



No comments:

Post a Comment