చెదరదు నీరూపం
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
05.04.2014
నీ కోపా తాపాలు
నీ తీపి శాపాలు
నన్ను నీ ఆలోచనల సడి నుండి
వేరు చేయలేవు ప్రియా..!
నా మస్తిష్కంలో ముద్రితమైన
నీ రూపాన్ని చెరిపేయలేవు ప్రియా!
నీ తీపి శాపాలు
నన్ను నీ ఆలోచనల సడి నుండి
వేరు చేయలేవు ప్రియా..!
నా మస్తిష్కంలో ముద్రితమైన
నీ రూపాన్ని చెరిపేయలేవు ప్రియా!
నీ వెంత ఈసడించినా..
అవి నా ఆలోచనను తాకలేవ్
నీవెంతగా మూతి ముడిచినా..
నీవంటే.. ఇష్టం తరగటం లేదు ప్రియా..!
నీపై నా మనసును మార్చలేవు ప్రియా..!
అవి నా ఆలోచనను తాకలేవ్
నీవెంతగా మూతి ముడిచినా..
నీవంటే.. ఇష్టం తరగటం లేదు ప్రియా..!
నీపై నా మనసును మార్చలేవు ప్రియా..!
నీ రూపం మెరవగానే..
నాలో అలజడి..
నీ కాలి అందె అలికిడికే..
మొదలయ్యే గుండె సవ్వడి..
మాట మౌనం ప్రక్కనే నక్కుతుంది.
గాలి గుటకల్లో నీరై ఇంకి పోతోంది
నాలో అలజడి..
నీ కాలి అందె అలికిడికే..
మొదలయ్యే గుండె సవ్వడి..
మాట మౌనం ప్రక్కనే నక్కుతుంది.
గాలి గుటకల్లో నీరై ఇంకి పోతోంది
నాకే కాదు..
నీ కోరచూపుల శరాలు
నీ ఇకిలింపుల పిలుపులు
నీ ఈసడింపుల నటనలు
నీ అసహనపు వెతుకులాటలు
నీ చేతి మెటికల చప్పుళ్ళ మాటున
నాకు సంజ్ఞలందిస్తూనే ఉన్నాయ్
నీ ఇకిలింపుల పిలుపులు
నీ ఈసడింపుల నటనలు
నీ అసహనపు వెతుకులాటలు
నీ చేతి మెటికల చప్పుళ్ళ మాటున
నాకు సంజ్ఞలందిస్తూనే ఉన్నాయ్
నీవు నాకోసమే పుట్టావంటున్నయ్
మౌనంగావుంటూ చెప్పకనే చెప్పేస్తున్నయ్
నువ్ మూగనోము వీడతావని
నీ తలపు తలుపు తెరుస్తావని
మౌనంగావుంటూ చెప్పకనే చెప్పేస్తున్నయ్
నువ్ మూగనోము వీడతావని
నీ తలపు తలుపు తెరుస్తావని
ఆ రోజు కోసం
ఎన్నాళ్ళైనా..
ఎన్నేళ్ళైనా..
నా మనసు వేదనను
మౌనంగానే భరిస్తా ప్రియా..!
ఎన్నాళ్ళైనా..
ఎన్నేళ్ళైనా..
నా మనసు వేదనను
మౌనంగానే భరిస్తా ప్రియా..!
No comments:
Post a Comment