Wednesday 28 May 2014

కృష్ణ కృపాసాగరం

కృష్ణ కృపాసాగరం

- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
18.04.2014

నల్లవాడు.. మనసు వెన్నై ఉన్నవాడు...
ఆకాశంవర్ణం వాడు.. మబ్బంటి మనసైనోడు..
హరివిల్లు ల నవ్వులు చిలికెటోడు
పచ్చని పచ్చిక మోము వాడు..
సంద్రం రంగు పులుముకున్నోడు...
తియ్యని నదిని మనకిచ్చినోడు..
యామిని రూపము వాడు..
వెలుతురు మనకంపేవాడు.. 
అతడెపో నందనందనుడు...శ్యామసుందరుడు



ఆ నల్లవాడు ....
పాలనురుగంటివాడు.. తెల్లవాడు
గోవర్ధన ధారి వాడు, గోవుల కాపరివాడు
రాధా ప్రేమ హృదయ బంధీ వాడు..
శ్వాస,ధ్యాస సకలం తానైన ప్రియ మాధవుండు..
తోట మాలి యతడు....తరచి చూడ అంతయూ వాడు
నీ నా మనసు చదివినోడు..
ప్రేమకు మరురూపం అతడు
వలపుకు నెలవు అతడు
తలపుల వాకిలి అతడు..
అతడెపో అమ్మల - ముద్దుగుమ్మల మది నెగ్గినోడు
మురళి రవములతోడ మురిపించువాడు
నెమలిపింఛముతోడ ముక్కంటి అయినోడు..
గీతవాక్కులతోడ దారిసూపిన గురుడు
నీతికి రీతికి జాతికి అద్దంలో చంద్రబింబమ్మితడు
కామి కాదు వాడు..మోక్షగామియె అతడు..
అతగాడు మనుజుల మనమెరిగిన..మనసున్నవాడు..
మనసైనోడు.. నన్నె గెలిచిన ఆబాలగోపాలుడు..
గోపాలుడు గోలపాలుడు గోపికాలోలుడు
రాధా ఆరాధ్యుడు.. గీతాచార్యుడు.. ఆత్మసుందరుడు 
మీరు చూస్తున్న కృష్ణుడు.. 'నల్ల ' వాడు

No comments:

Post a Comment