//ఆకాశవాణి//
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
05.07.2014
ఈ తొలిసంధ్యలో
తీయని ఆ స్వరమధురిమ
నను చేరగనే..
ఏ జన్మ సువాసనలో..
ఏ పూర్వపు సరిగమలో..
ఏ స్మృతుల మేలుకొలుపో..
నా హృదయానికి
ఉదయపు చూపు పూయించి
నా మాటలకు
ఓంకారాక్షరం రాయించి
నా బడలికలకు
ప్రాణవాయువు ప్రసాదించి... ,
ఆహా..!!
ఎంతటి అశ్వచల శక్తి ఆ కంఠసీమలో..
ఎంతటి భావ ధనావేశం ఆ తీయతీయని స్వరఝరిలో..
ఎంతటి మనోల్లాస తరంగధైర్ఘ్యం ఆ చిలకపలుకులలో..
ఏమని చెప్పను ప్రియా..!
నిను రోజూ వినాలని వుంది..
నీ ధ్యాసలో గడపలని వుంది..
నీ కౌగిలిలో కరిగిపోవాలనుంది
నీ ఒడిలో ఒదిగి పోవాలనుంది..
ఏమై పోయావోయ్..!
నా రాణీ 'ఆకాశవాణి '..
తాళలేని నీ విరహవేదనలో..
నన్ను, నీకై మింటిలో కలిసిపోనీ..!!
(రేడియో వినడం అలవాటై ...పొద్దుటే వినబడక పోతే రేడియో శ్రోత బాధ ఇలా వుంటుందన్నమాట..!)
నిజంగా నిజం....ఆస్ప్రో ప్రకటనలు వింటే దానిలోనే వినాలి. పాటలూ, పద్యాలూ, వార్తలు చదువుతున్న వారి పేర్లూ, పాటలు కోరిన శ్రోతల పేర్లూ ( పాటలు తక్కువా పేర్లు యెక్కువా అంటే అది వేరే విషయాంతరం కదా) ఇవన్నీ దాంట్లోంచే బయటపడి మన యెదలలో దూరి ...అన్నట్లూ కొన్నిసార్లు నా పేరు కూడా రేడియోలో వినిపించిందండోయ్ కల్యాణం గారూ...
ReplyDeleteధన్యవాదాలండీ గురువు గారూ..!
Delete