Saturday 7 February 2015

పంచాక్షరి


(ముక్తపదగ్రస్తం అనే పద్దతిలో నేను వ్రాసిన శివ స్తోత్రం ఇది... దీనిలో ప్రతి  పాదం  లోని   చివరి పదం  తరువాత పాదం  మొదటి పదం గా వ్రాయడం జరిగింది. )



// పంచాక్షరి //
                                                                           - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                                                17.11.2014


శివ నామమే సర్వం శరణం
భవ భయ హరణం హరణం


పంచాక్షరి మంత్రం పరిరక్షితం
పరిరక్షిత మంత్రం ప్రచండం
ప్రచండ మంత్రం ప్రమోదం
ప్రమోద మంత్రం ప్రణమామ్యహం


అఖండ తేజోమయం అనంతం
అనంతకోటి తత్త్వం ఆనందం
ఆనంద నందనం అశేషం
అశేష భక్త సులభం అర్ధనారీశ్వరం

నిర్మల పూజితం నిఖిలం
నిఖిల చరితం నిర్గుణం
నిర్గుణ కారకం నిగూఢం
నిగూఢ సత్యం నమ:శివాయం
 


త్రినేత్రం త్రిభువన భూషితం
భూషిత సర్పచంద్ర విరాజితం
విరాజితమే రూపం విలక్షణం
విలక్షణ భోళాతత్వం లోక రక్షకం




 

త్రిశూలం చరాచర సృష్టి రహస్యం
రహస్యమే విరాగి జీవనం
జీవనమే సకలకోటి స్ఫూర్తికారకం
కారకమే దక్షయజ్ఞ వినాశకరం, దేవం

 
భస్మధారణ దర్శనం భయావహం
భయావహ తాండవం కామదహనం
దహన ప్రదేశం నిత్యనివాసం
నివాసమే సర్వభక్త హృదయం, శివం


పతీత పావనం ఓంకారనాదం
ఓంకారమే జగత్ గమనం
గమనం ఆదిభిక్షుం నమామిం
నమామీశ్వరం పార్వతీ పతిం, హరం


                                    
   (కార్తీక సోమవారం ఉపవాసదీక్ష సమయం ..)



13 comments:

  1. క్రొత్తగా బ్లాగోపాధ్యాయినిగా మారిన కళ్యాణి గారికి అభినందనలు.
    తొలుదొల్త పంచాక్షరీ మంత్ర పూర్వక ముక్త పద గ్రస్తాలంకార శోభితయుక్త
    కవనాన్ని వెలువరించడం ముదావహం.
    ఎందుకంటే వాగర్ధావివ...........అన్నట్లు.బహుధా ప్రశంసనీయం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ.. సోమార్క గారూ.. !

      Delete
  2. MUKTHAPADAGRASTAM LO NI PANHAKSHAARI BAGUNDI

    ReplyDelete
  3. చాలా బాగుంందంండీ..మంంచి ప్రయత్నంం..
    పదాల నడక రమణీయంం...శివానుగ్రహంం లేనిదే ఇది సాధ్యంం కాదు...

    ReplyDelete
  4. అయ్యా!కల్యాణ్ గారూ!మీ ముక్తపద గ్రస్త కవిత మీకు ముక్తి పద గ్రస్తం కావాలని నా కోరిక.గత ఏడాది నా కామెంట్ చూశాను.అప్పట్లో కల్యాణి గారి రచనలా భావించి ఉంటాను.అందుకే ఒక స్త్రీ కవిగా అభినందనలు తెలిపాను.బహుధా క్షంతవ్యుడను.మీకు నా అభినందనలండీ!

    ReplyDelete
  5. చక్కగా చెప్పారు

    ReplyDelete
    Replies
    1. ధన్యోస్మి శర్మ గారూ..

      Delete