Wednesday, 18 February 2015

ఎవడు కనిపెట్టేడో గానీ..???

// ఎవడు కనిపెట్టేడో గానీ..???//

                              - కరణం కళ్యాణ్ కృష్ణకుమార్
                                                     19.10.2014


                    
               కమ్మగా ఎర్రెర్రని ఆవకాయకి , కాస్త పప్పొడి కలిపి, చారెడు నెయ్యి అద్ది, పెద్దపెద్ద ముద్దలు చేతిలో పెడుతున్న అమ్మమ్మ గుర్తొంచిందీ రోజు... !
            అసలు ఆ ముద్ద మహత్తో.. అమ్మమ్మ చేతి చలవో... ఆవకాయలో ని రుచి మహిమో గానీ.. ఆ ముద్ద రుచి నాలికకు తగిలిన వాడు జన్మలో మరిచిపోలేడు.. ఇది మాత్రం సత్యం.. సాంబ  డైరీ లో రాసుకున్నా రాసుకోకపోయినా ఇది 100 శాతం వాస్తవం.                 దీనిపై కాస్త ..మరికాస్త.. మరింత లోతుగా ఆలోచిస్తుంటే.. అసలు ఆవకాయలోనే ఆ మహిమ ఉన్నదనిన్ని.. దానికి అమ్మమ్మ ప్రేమ, తిరుపతి లడ్డంత అందమైన ముద్ద మధురంగా మారాయని తెలుస్తోంది. ఘాటుకి కన్నీళ్ళు కారుతూ... సుస్..సుస్.. అంటూ .. తింటూ లొట్టలేసుకుంటూ.. ముద్ద కోసం పోటీపడి కొట్టుకుంటూ, వారేవా ! ఆ రోజులే వేరు కదూ.. పాపం పసివారు.. ఈ రోజుల్లో పిల్లలకి ఇలాంటివి ఒకటుంటాయని తెలీదు.. కొన్ని రోజులైతే ఊహకూడా ఉండదు.. అతనెవరో ఫారెనరు... పూరీలోకి గాలి ఎలా పంపారబ్బా ఇండియన్స్ అని సోచాయించాడంట// మన పిల్లలూ అలా కొన్నాళ్లకు తయారవుతారని .. మన మోత బరువు పుస్తకాలే శెలవిస్తున్నాయ్ అనుకోండి.
  ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకనేగదా మీఫేసు ఫీలింగ్.. అక్కడికే కమింగు..


ఎన్నో ఏండ్లు గతించి పోయినవి గానీ.. అల ఆవకాయ చేసిన వారెవరో తెలియక పాయనే..!

ఎంచక్క ముక్కలు కొట్టి.. ఆవపిండి తయారు చేసి, కారం వేసి.. అబ్బబ్బ చేసేటప్పుడే ఒళ్ళు పులకరించిపోతుందంటే.. ఆహా ఏమిరుచి.. తినరామైమరచి.. రోజూతిన్నా కానీ మోజే తీరనిది అన్న పాట గుర్తొస్తుందనుకోండి..

రెండు నుంచి వారం రోజుల్లో కుళ్ళిపోయి, పాడైపోయి, దేనికీ పనికి రాకుండా పోయే మామిడి లేదా ఇతరాలు, ఏదైనా ఏళ్ళతరబడి పాడైపోకుండా ఉండటానికి ఎన్నిరకాల ప్రయోగాలు చేశారో.. ఎంతమంది మృత్యువాతపడ్డారో.. అని అనిపిస్తుంటుంది ఒకోసారి...

       మనకు బుద్ధి పుట్టినప్పటి నుంచీ చూస్తున్నాం.. ఏ ఫారెన్ ఐటం అయినా... నెల రోజుల మించి స్టాక్ ఉంటుందా...???
          అంటే నిన్న వచ్చిన హుద్ హుద్ లాంటి ప్రకృతి వైపరీత్యాలూ... ఇంటిల్లిపాదీ పనీ పాట చేసుకోని బ్రతకడాలు వంటి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేందుకు మన భారతీయ పాకశాస్త్ర ప్రావీణ్యులు కనిపెట్టిన స్టాక్ ఫుడ్ లాంటివి ఇంతవరకూ ఎవ్వరూ కనిపెట్టలేదనే నాకనిపిస్తోంది..!  మనకు తెలియని వెక్కడన్నా ఉన్నాయేమో గానీ , విన్నంతవరకూ అదీ పరిస్థితి..

ఆ తర్వాత అనేకరకాల ఆవకాయలు చేశారనుకోండీ, మన ఇంటి దేవతలు..
    ప్రయోగాలకు పుట్టినిల్లు వంటిల్లేనని ఇదే ఋజువుచేస్తోంది మరి.. కాదని అనగలరా..!

     ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఆవకాయ కనుక్కున్న ఆ మహానుభావుడో, మహానుభావురాలో ఎవరైతే వారికి ఒక్క నమస్కారం పెట్టుకుని .. ఎంచక్కా ఆవకాయ లాగించేయండోయ్..ఈ మధ్య అదేదో వచ్చింది... లేటెస్ట్ ఆవకాయ్ బిర్యానీ ట..! ఆదివారం వారు అదీ కూడా లాగించి..

ఆవకాయ టేస్ట్ ను వేస్ట్ ఫెలోస్ కి చెప్పి, పేస్ట్ మొఖాలూ ఇది ఇండియన్ బెస్ట్ అనిన్ని.. అసలు వరల్డ్ ఫస్ట్ అనిన్ని ప్రచారం చేయండి.. పేటెంటుకి ఏ విదేశీ సంస్థో పోటీ పడుతుందేమో ఓ కన్నేసుంచండి...! 

అదండి సంగతి.!  సందట్లో సడేమియాగా మీరూ ఎంచక్క ఉత్తపప్పు.. అదే సుద్ధ పప్పు లో నో.. కందిపచ్చడిలోనో పప్పొడిలోనో , ఆవకాయ కలుపుకుని, నెయ్యేసుకుని  కమ్మగా ముద్దలు లాగించేయండే..!

8 comments:

  1. ఆవకాయలో నెయ్యి వేసుకుంటే చప్పబడిపోతుంది. కాస్త మంచినూనె లేదా పప్పు నూనే వేసుకుని తింటే కారం తగ్గినా రుచి మారదు.. వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని కాసిన్ని అప్పడాలు, వడియాలు, చల్ల మిరపకాయలు చివర్లో కాస్త పెరుగు ఉంటే చాలు.. వేరే పప్పు, పొడులు అవసరం లేదు..

    ReplyDelete
    Replies
    1. హహహ నిజమేనండోయ్ జ్యోతి గారూ.. నూనేవేసి తింటుంటే ఉంటుంది సామిరంగా....!

      Delete
  2. ఆవకాయ అన్న నాలుగక్షరాలే నోట్లో నీళ్ళూరిస్తుంటే దానికొక బొమ్మ పెట్టి, దాన్ని మరింత రుచిగా వర్ణించటం, సారీ వడ్డించటం, ఏమైనా భావ్యమా! కొత్త ఆవకాయ రుచి చూడటానికి ఇంకా మూడు నెలలాగాలా! మూడు నెలలంటే 100 రోజులు, 100 రోజులంటే 2400 గంటలు.

    ReplyDelete
    Replies
    1. హహహ.. శతదినోత్సవ విరహమన్నమాట.. ఫరవాలేదులే రావు గారు.. అయినా మన పాత ఆవకాయ జాడిలో నుంచి దించండి ఈ లోపు... .

      Delete
  3. Avakaya pettamgane oka bottle fridgelo dacheyandi chivarlo kuda fresh avakaya vuntundi.jaadi mottam kadandoy

    ReplyDelete
  4. Avakaya pettamgane oka bottle fridgelo dacheyandi chivarlo kuda fresh avakaya vuntundi.jaadi mottam kadandoy

    ReplyDelete
  5. హహాహ.. మస్త్ ఐడియా..

    ReplyDelete