Thursday, 12 February 2015

అందాల నా బుల్లి

ద్విపదను పోలినట్లుండే నేను వ్రాసిన కవిత - మీ కరణం



// అందాల నా బుల్లి //

                   - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                            03.11.2014


కలలోన నా రాణి కవ్వంచినదోయి
కనుదోయితో నవ్విసిరి బంధీని జేసి

మందాన లిప్ స్టిక్కు మూతంత రాసింది.
కంటి కాటుక, పులిమి దిష్టిచుక్కేలె అంది

మిలమిలా మెరిసి మతిపోగొట్టింది
కిలకిలా నవ్వేసి గుండె కోసేసింది

మందారమై వచ్చి మేను పై వాలింది
మకరందాల ముద్దు..మురిపాలొలికింది

చిన్న చిన్న గ ఆక్రమించే స్తోంది నన్ను
చుట్టు చూస్తారంటు చిలిపిగ నేనాపేను ..

కాదు కుదరదంటు మూతి ముడిచేసింది
లేదు మాటాడనంటు బుంగమూతెట్టింది..

బుల్లంటె నాకెంత.. పానమో తెలుసాంటు..
గారాలు నేపోతు.. కాళ్ళనే పట్టాను

కిట్టున్నే తన్నాను ..తిట్టులే తిట్టాను
ఒట్టేసి చెబుతున్న..శివంగి నేనంటు

చిందులే వేసింది చిత్తడిగ ఉతికేసింది
సర్రునా వాలుజడ విరిసి కొట్టేసింది

కెవ్వుమని అరిచానో..కళ్ళు కలిపేసింది
కన్నీటి వరదై ..కుమిలిపోయింది


నేనంటే ఎంత..పానమో బుల్లికి
నేనంటే ఎంత..ధ్యానమో సిరికి

మల్లెలే తురిమింది.. కొంగు ఎగదోసింది
చిలిపిగా చూస్తూనె..పైపెదవి కొరికింది

పానాలె పోయేను..గుండెలే అదిరేను
అందాన్ని చూడంటు..మనసు మెలిపెట్టేను.

ఏమందమోగా తనది..ఎక్కడా లేనిది
ప్రకృతినే తెచ్చి..పైటగా చుట్టింది..

జూకాలు కదిపింది..దండ నే కొరికింది
అరికాలు రుద్దుతూ..అల్లరే చేసింది

గుండెపై కాలుంచి గజ్జె ఘల్లనిపించె
ఒళ్ళంతా ఝల్లుమన మేను మైకము క్రమ్మె

చూడనట్టుగ నేను..చూపులతో కమ్మేను
కొంటె చూపులు చూస్తు..కొంకర్లే పోయేను..

చేతిలోని చెండు విసిరి వేసేసింది..
చిందినా పూలతో..వడలు మత్తెక్కింది

వగలు చూపుతు బుల్లి, సెగలు పోతూవుంది
విరులు నలుపుతు బుల్లి ,మరులు కురిపించింది

ఇంతలోనే మబ్బు, నల్ల పైట కప్పింది
చంద్రాన్ని చుట్టేసి మెల్లగా దాచింది

ఎగసి పడుతున్న ఎదలు..సొగసు కాంతులు జల్లె
ఒడసి పట్టెను నన్ను..నుదుట పట్టెను చెమట

ముంగిటే చేరింది..ముద్దులే ఇచ్చింది
మత్తు చూపులతో..కన్ను ఎగరేసింది.

మందారమై వచ్చింది..ముద్దగా మురిసింది
అందెలే కదిపింది..అందాలు చూపింది

కిల కిలా నవ్వుల్ని, రువ్వుతూ నాబుల్లి
మెల్ల మెల్లగ అగ్గి భగ్గుమని రాజేసింది

జారి పోయెను గుండె మూగ బోయెను గొంతు
వడి వడిగ నను చేరి, పడి పడి నవ్వె నాసిరి

మెల్లగా చేరింది, మేను పెనవేసింది
మత్తుగా చూస్తూనె ,ఒడిలోన ఒదిగింది

సప్త సాగర ఘోష మెత్తగా వినిపించ
ఝాము మొత్తము గోము సద్దు చేసె

వగల మారి బుల్లి, దిగులన్నది మరచి
ఆక్రమించె నన్ను.. అతిక్రమించె మిన్ను

చిన్న చిన్నగ గాలి, చల్లగా వీచేను
చిన్న చిన్నగ చినుకు నేలనే రాలేను

మట్టి వాసన తోటి మల్లె వాసన చేరె
గమ్మత్తుగ మత్తులో ప్రాణ మూగిసలాడె

అంతలోనే వచ్చె మెలుకువ, కాకుల కువకవతో
ఎటుపోయెనో నా బుల్లి ,ఎటుపోయెనో నా సిరిమల్లి..!!


(చిత్రం గుగూల్ సహకారం... ఆర్టిస్ట్ NB గారని ఉంది.. .. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో...)
 @ COPY RIGHTS RESERVED)

No comments:

Post a Comment