// సద్గురువుకి వర్ణమాల //
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
12.07.2014
అజ్ఞాన అంధకారాన్ని వెలుగుతో నింపే ఓనమాలు దిద్దించి
ఆకాశపు హద్దులు అందించే విద్యాబుద్ధులు నేర్పించి
ఇలలో నడతకు క్రమశిక్షణ నడకలు నేర్పి
ఈలోకాన మమ్ము మనుషులుగ మార్చి
ఉన్మత్తులైన మమ్ము ఉత్తములుగా తీర్చి
ఊహించని ఎత్తుకు ఎదిగేందుకు నిశ్రేణి పేర్చి
ఋషిలా, యోగిలా, వ్యాసమునిలా యుగయుగాలుగ
ఎన్నో ..మరెన్నో విజ్ఞాన పుష్పాలు పూసగుచ్చి తెచ్చి
ఏజన్మ వరమో..మాకు ... ఏ నాటి ఫలమో
ఐక్యత , సఖ్యత, వినయశీలత అలవరచిన మిమ్ము
ఒక్కసారి తలచిన చాలు ఒనగూరు ఫలాలు..
ఓపలేనంత ఆనంద పరవశాలు
ఔషదాలె మాకు మీ శిక్షలు ,పరీక్షలు..
అందుకే మేమెప్పుడు మీకు ఋణగ్రస్తులం..
అ(:)హం అదుపు నుంచి మిమ్ము తలచుకుంటూనే ఉంటాం..
అంతటి గురువులైన మీరు....
కమ్మని కథలతో మమ్మలరించిన క్షణాలు
ఖడ్గము ,కలమే యని ఆ పదును చూపిన రోజులు
గతించిన ఆ కాలం కళ్లముందే ఉంది.. ఈ నాటి మా ఈ -
ఘన కీర్తి మీ చలువె గా .....వా-
ఙ్మ య భూషణా .. గురుదేవరా..!
చదువు తోటి ఆటలు , పాటలు, మాటలు
ఛత్రిలాంటి ఛంధోబద్ద, అలంకారయుతంగా..
జన్మంతా మనోఫలకం పై ముద్రితమయ్యేలా స్వర-
ఝరి తో రాగ మాలపించి.. మరీ
జ్ఞానమందించిన బాదరాయణా..!
తరము తరము నిరతము క-
థగా చెప్పెదము మీ బోధనా పటిమ
దరి చేర్చు, తిమిరము నుంచి అమరమునకని..
ధన మదియె మాకు వేల కోట్లు
నడియాడె దైవమా.. నరుడైన వ్యాసరూపా..!
పలక పట్టించిన గురువుగ
ఫలమెన్నడు మీరు కోరలేదు..
బలపము పట్టిన నాడె
భక్తి భావము తో మిమ్ము కొలిచేము.. మా-
మనమున మీరె నిండె మా జ్ఞాన వితరణి..!
యమునా తీరాన అర్జునునకుపదేశి
రక్కసుల సరి ద్రోవ జూపిన శుక్రసామి
లవ కుశుల దీర్చిన వాల్మీకి..
వసుధన వినుతికెక్కిన ద్రోణాచారి
శరము బట్టి చూపిన కౌశిక ముని
షట్ చక్రములు చూపిన యోగ బ్రహ్మ
సరిలేరు నీకెవ్వరూ ఈ జగత్తున
హరికి అంతరాత్మవై.. మనో నేత్రమై.. తా-
ళపత్రమై .. విశ్వ భవితకు మార్గదర్శివై
క్షరము కాని అక్షరములతో (మము) సానబెట్టిన పరుసవేది.. మ-
ఱపు లేకుండా జేసి..మదిలోనె లోనె పూజలందుకొను పుణ్యపురుషా..!
పామరులమైన మాకు విజ్ఞానమొసగిన మీ తపస్సు
మా ముంగిట చీకటిని పారద్రోలిన ఉషస్సు
విద్యాదాన యజ్ఞంలో మీరో హవిస్సు
తేనె కన్న తీయన మీ మనస్సు
భువి ఉన్నంత వరకు నిలుచు మీ యశస్సు
మీ పాదపద్మములకు ఇదే నా హృదయ నమస్సు..!!
(అ నుంచి ఱ వరకు అన్ని అక్షరాలతో గురువుకి వేసిన వర్ణ మాల ఇది.. గురుభ్యోనమ:)
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
12.07.2014
అజ్ఞాన అంధకారాన్ని వెలుగుతో నింపే ఓనమాలు దిద్దించి
ఆకాశపు హద్దులు అందించే విద్యాబుద్ధులు నేర్పించి
ఇలలో నడతకు క్రమశిక్షణ నడకలు నేర్పి
ఈలోకాన మమ్ము మనుషులుగ మార్చి
ఉన్మత్తులైన మమ్ము ఉత్తములుగా తీర్చి
ఊహించని ఎత్తుకు ఎదిగేందుకు నిశ్రేణి పేర్చి
ఋషిలా, యోగిలా, వ్యాసమునిలా యుగయుగాలుగ
ఎన్నో ..మరెన్నో విజ్ఞాన పుష్పాలు పూసగుచ్చి తెచ్చి
ఏజన్మ వరమో..మాకు ... ఏ నాటి ఫలమో
ఐక్యత , సఖ్యత, వినయశీలత అలవరచిన మిమ్ము
ఒక్కసారి తలచిన చాలు ఒనగూరు ఫలాలు..
ఓపలేనంత ఆనంద పరవశాలు
ఔషదాలె మాకు మీ శిక్షలు ,పరీక్షలు..
అందుకే మేమెప్పుడు మీకు ఋణగ్రస్తులం..
అ(:)హం అదుపు నుంచి మిమ్ము తలచుకుంటూనే ఉంటాం..
అంతటి గురువులైన మీరు....
కమ్మని కథలతో మమ్మలరించిన క్షణాలు
ఖడ్గము ,కలమే యని ఆ పదును చూపిన రోజులు
గతించిన ఆ కాలం కళ్లముందే ఉంది.. ఈ నాటి మా ఈ -
ఘన కీర్తి మీ చలువె గా .....వా-
ఙ్మ య భూషణా .. గురుదేవరా..!
చదువు తోటి ఆటలు , పాటలు, మాటలు
ఛత్రిలాంటి ఛంధోబద్ద, అలంకారయుతంగా..
జన్మంతా మనోఫలకం పై ముద్రితమయ్యేలా స్వర-
ఝరి తో రాగ మాలపించి.. మరీ
జ్ఞానమందించిన బాదరాయణా..!
తరము తరము నిరతము క-
థగా చెప్పెదము మీ బోధనా పటిమ
దరి చేర్చు, తిమిరము నుంచి అమరమునకని..
ధన మదియె మాకు వేల కోట్లు
నడియాడె దైవమా.. నరుడైన వ్యాసరూపా..!
పలక పట్టించిన గురువుగ
ఫలమెన్నడు మీరు కోరలేదు..
బలపము పట్టిన నాడె
భక్తి భావము తో మిమ్ము కొలిచేము.. మా-
మనమున మీరె నిండె మా జ్ఞాన వితరణి..!
యమునా తీరాన అర్జునునకుపదేశి
రక్కసుల సరి ద్రోవ జూపిన శుక్రసామి
లవ కుశుల దీర్చిన వాల్మీకి..
వసుధన వినుతికెక్కిన ద్రోణాచారి
శరము బట్టి చూపిన కౌశిక ముని
షట్ చక్రములు చూపిన యోగ బ్రహ్మ
సరిలేరు నీకెవ్వరూ ఈ జగత్తున
హరికి అంతరాత్మవై.. మనో నేత్రమై.. తా-
ళపత్రమై .. విశ్వ భవితకు మార్గదర్శివై
క్షరము కాని అక్షరములతో (మము) సానబెట్టిన పరుసవేది.. మ-
ఱపు లేకుండా జేసి..మదిలోనె లోనె పూజలందుకొను పుణ్యపురుషా..!
పామరులమైన మాకు విజ్ఞానమొసగిన మీ తపస్సు
మా ముంగిట చీకటిని పారద్రోలిన ఉషస్సు
విద్యాదాన యజ్ఞంలో మీరో హవిస్సు
తేనె కన్న తీయన మీ మనస్సు
భువి ఉన్నంత వరకు నిలుచు మీ యశస్సు
మీ పాదపద్మములకు ఇదే నా హృదయ నమస్సు..!!
(అ నుంచి ఱ వరకు అన్ని అక్షరాలతో గురువుకి వేసిన వర్ణ మాల ఇది.. గురుభ్యోనమ:)
super andi
ReplyDeleteTq kiran garu
Delete