Saturday 7 February 2015

జలతారు దీపాలు కవిత పై ఓ సమీక్ష - శ్రీ పుష్యమి సాగర్

 (  నేను వ్రాసిన జలతారు దీపాలు కవిత చదివి శ్రీ పుష్యమి సాగర్ గారు స్పందించి వ్రాసిన రీవ్యూ ఇది.. సమీక్షలు  అడిగి వ్రాయించుకునే ఈ రోజుల్లో ఓ కవితకకు ఇంతగా స్పందించి సమీక్ షవ్రాసిన రచయిత, కవి శ్రీ పుష్యమి సాగర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. వారు వ్రాసిన సమీక్ష యథాతథం గా ఇక్కడ పొందుపరుస్తున్నా..! సమీక్షకులు శ్రీ పుష్యమి సాగర్ గారి చిత్రాన్ని కూడా అభిమానంతో  ఇక్కడ ఉంచుతున్నా..   - మీ కరణం )





!!నచ్చిన కవిత !!  -   
                          -   పుష్యమి సాగర్,  హైదరాబాద్
                               నవంబర్ 13'2014  9:31pm    
                            


//జలతారు దీపాలు//   ! కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ !
______________________________
ఈ కవిత ను చూసాక నాకు అప్పుడు ఎప్పుడో "అలిసెట్టి ప్రభాకర్ " రాసిన "వేశ్యా" వృత్తి లో వున్నా ఆడపడుచు ఎంత

శ్రీ  పుష్యమి సాగర్
దారుణం గా ఉన్నదో అనిపించిది .."తను పుండై , మరొకరి పండై " ....గుర్తుకు తెప్పించారు ..ఆర్దత, ఆర్తి, మరికాస్త బాద, అందులోంచి వచ్చిన ఆవేశం .వెలియాలి దుస్థితి ని పట్టించుకోని పాలకుల పై ఎక్కుపెట్టిన బాణం ఇది
వెలియాలు ఈ కలం లో అయినా కూడా నలుగురికి చెందినా ఆస్తి గా నే భావిస్తుంది ...ఈ సమాజం ..అది రూల్ గా మార్చేసారు ..... మరి పెళ్లి కాకుండా అన్యాయం గా గొంతు నులిమి సాని కొంప లో దించాక ...పాపం ఆ పిచ్చిది మాత్రం ఏమి చెయ్యగలదు ...
!!ఎర్రనీళ్ళు చూడకుండానే//కస్టమర్ కి పరుపైనప్పుడు!! చూడండి పెళ్లి కాకుండా బలవంతం గా పడుపు వృత్తి లోకి దింపబడి పరుపులేక్కడం దారుణం కాదా...
పాలకుల స్వార్ధ ప్రయోజనాన్ని, మెడ లొ కుక్క బిళ్ళ వేసినట్టు పడుపు వృత్తి కి లైసెన్సు ఇవ్వడం అమాఅనీయమైన దారుణం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా ఎప్పుడు పట్టించుకోని పాలక వర్గం ...ఇప్పుడు మాత్రం లైసెన్స్ ఇచ్చి మరి మంచం ఎక్కమంటారు ఏమి దారుణం ...
ఆడుతూ పాడుతు చిందాడే వయస్సులో //అవాంచిత గర్భం దాల్చినప్పుడు..//ఏమైందో అర్ధం కాక పిచ్చిచూపులు చూసినప్పుడు //అప్పుడు పట్టని ఓ పాలకా..! ఇప్పుడు నీకింత ప్రేమోంటో..?
పై పంక్తులలో చితికిపోయిన బాల్యం కిడ్నాప్ చెయ్యబడి పడుపు వృత్తి లో తోసేసినప్పుడు ....ఇంకా ప్రత్యుత్పత్తి అంటే కూడా తెలియని వయసులో గర్బం దాల్చి పిచ్చి దాని లా మారినపుడు ఏమి అయ్యారు పాలకుల్లారా ?? సమాధానం దొరకని ప్రశ్నే ....
అభం శుభం తెలియని బాల్యాన్ని దొంగిలిచి వేరే వారికి అమ్మేసినప్పుడు, ప్రేమ పేరు తో నమ్మిన వాడు నట్టేట ముంచి సాని కొంప లో పడేసి వెళ్ళినప్పుడు, ..., ముసలితనం లో కూడా కోరిక చావక డబ్బు తో తనన శరీరానికి వేల కట్టి వేలం వేసినపుడు జారిన కన్నీళ్ళ కు సమాధానం చెప్పాలి పాలకుల్లారా .
!వాడెవడో ముసలి మదపుటేనుగు//వేలం పాటకి అంగడి బొమ్మై ఆడినప్పుడు ..//. కన్నీటి మరక చెంపపై జారినప్పుడు..!
వ్యవస్థ లో సామాజికం గా అన్ని చోట్ల వివక్ష త ని ఎదుర్కుంటారు ...నాలుగు మెతుకుల కోసం తమ శరీరాన్ని తనువూ తో సంబంధం లేకుడా ఆత్మని చంపేసుకున్న మేఘాలు వాళ్ళు ...నిజమే ...
కడుపు చించుకు కాలిపై పడ్డ భోగ బ్రతుకులు//గుప్పెడు మెతుకులకై సిగ్గు మరిచిన జీవితాలు
పిపీలకం లా చిదిమేయబడ్డ కరిగిన మేఘాలు//
ఒడలు, కాలిన సిగిరెట్ల కు యాష్ ట్రేగా మారినప్పుడు//మెడుకు, ఉచ్చువేసి వెర్రినాకొడుకులు మూత్రం తాపినప్పుడు//నగ్నంగా వేలాడదీసి వీడియోలు తీసినప్పుడు.. //వద్దన్నా వినకుండా రక్షణ తొలిగించి రమించినప్పుడు
తన శరీరం తో ఎంత దారుణం గా ఆడుకున్నారో మానవత్వం కూడా మరిచి మృగాల్ల త్రుస్న తీర్చుకున్నప్పుడు ఎన్ని వేలా సార్లు సచ్చిపోయిందో కదా ఆ ఆడ బిడ్డ
ఇదే పంక్తులలో
//కోతి చేష్టలతో చేష్టలుడిగి.. కోతి రోగాలల్లుకున్నప్పుడు //చీకి చీకి చిక్కి శల్యమై అందాల భామ//ఈగల ఆవాసమైనప్పుడు //తనతో కులికినోళ్ళళ్ళా, నోరెళ్ళబెట్టి వెళుతూ //తానెవ్వరో తెలీయనట్లు ..నటులైనప్పుడు ..///
అందమైన భామ గా ఉన్నప్పుడు రోగాలను అంటించి ఒక సజీవ శవం గా మార్చి కళ్ళెదురుగా ఏమి తెలియని వాళ్ళలా నటిస్తుంటే మనిషి గా ఆమె ని మనమే చంపెసాము కదా....
"మా కుళ్ళిన బ్రతుకుల్లో .. //వెలుగు నింపేందుకు మాకు లైసెన్సులిత్తారా??"
ఇంత దారుణ స్థితి లో మేము మా బతుకులను లాగుతుంటే పాలకుల్లారా పాడుబడ్డ ఈ వృత్తి కి లైసెన్సు ఇచ్చి చట్టబద్దం చేస్తారా....ఇంకా మరెందరి ఆడపడుచల జీవితాలతో ఆడుకుంటారు ...అంటూ కవి తన ఆవేదన ని ఆవేశాన్ని వ్యక్తం చేస్తారు
అవును, చట్టబద్దం చేసాక బాబు నేను వెశ్యను ....నాకు ఇంత ధర వున్నది మార్కెట్ లో రండి అని ఒక విలాస వస్తువు కు ట్యాగులేసుకుని పురుష ప్రపంచం లో తలొంచుకొని ఉండాలా...?.....చట్టం పోలీసులు వుంటే నే డబ్బులు ఇచ్చి ..చుట్టం గా మార్చుకున్న మీ కు ఇక లైసెన్సు ఇస్తే ...అంటీ లకు అమ్మడు అవ్వలా చట్ట ప్రకారం గా ...?.
మేము ట్యాగులేసుకుని తిరగాలా? //చట్టం ఉంటేనే, చుట్టంగా మార్చుకున్న మీకు//బాండ్లు రాసి ఆంటీలకు అమ్ముడవ్వాలా??
చివరాగా ఇలాంటి దయనీయమైన జీవితం లో నుంచి జన జీవన స్రవంతి లో కి రావాలన్న తపన ఉన్న కూడా రాలేని పరిస్థితి లో నేడు వొళ్ళు అమ్ముకుంటున్న అబాగ్యులు వాళ్ళు ...మాకు మాములు జీవితం గడుపుకునేదుకు అవకాశం ఇవ్వండి ...మీరు మమ్మల్ల్ని ఉద్ధరించ అవసరం లేదు .. వెలుగు లో కి తీసుకుపోక పోయినా పర్లేదు కాని ...చీకటి నరకపు కూపం లో తోయ్యకండి ...మమ్మల్ని మనుషులు గా బతకనివ్వండి అంటూ దీనం గా వేడుకుంటూ ముగింపు ఇవ్వడం చాల బాగుంది ...
నిశి కమ్మిన జీవితాలకు //వెలుగుబాట కాకున్నా మేలేన్నా..//దీపంపురుగుల్లా మార్చొద్దు.
మలమల మాడ్చొద్దు.. //మమ్ము ఏమార్చవద్దు..
ఈ కవి కి వారి జీవితాన్ని మాటల్ల్లో, అనుభవాల్లో దగ్గర వుండి చూసి అక్షరం గా మలిచిన తీరుకు అబ్బురం అనిపిస్తుంది ..కవితా వస్తువు కాని ...శైలి కాని ...వ్యక్త పరచటం లో కాని బిన్నం గా వున్నది ...ఎప్పుడైనా వాస్తవం చేదు గానే వుంటుంది కదా..ఎందుకో వీరి కవిత చదివాక మరేమీ చదవాలని అనిపించదు ...వ్యవస్థ లో బలవంతం గా దోచుకోబడ్డ అబాగ్యురాలి దీన గాద ను అక్షరీకరించిన తీరు బాగుంది ...
వారు మరిన్ని మంచి కవితలు రాయాలని కోరుకుంటూ
సెలవు
పుష్యమి సాగర్.. 13.11.2014



//జలతారు దీపాలు//


సగం గుడ్డలేసుకున్న దిక్కుమాలిన బ్రతుకుల్లో ..
వెలుగు రేఖవ్వడం మరిచావా ఓ పాలకా..!

దిక్కులు చూస్తూ.. అటూ ఇటూ పోయే వాళ్ళకు
వెర్రి సైగల కేకలేస్తూ..
కడుపు చించుకు కాలిపై పడ్డ భోగ బ్రతుకులు
గుప్పెడు మెతుకులకై సిగ్గు మరిచిన జీవితాలు
పిపీలకం లా చిదిమేయబడ్డ కరిగిన మేఘాలు

ఎవడబ్బో తెలియక వచ్చిపోయేవాణ్నల్లా చూస్తుంటే.. "
అందాల బొమ్మ రేటెంతో" అన్న వాడి ]
వెకిలి చేష్టలకు విస్తుపోయినప్పుడు
ఏం వాగాడో అర్ధం కాక బిత్తరపోయినప్పుడు..

వాడెవడో ముసలి మదపుటేనుగు
వేలం పాటకి అంగడి బొమ్మై ఆడినప్పుడు ..
. కన్నీటి మరక చెంపపై జారినప్పుడు..

ఎర్రనీళ్ళు చూడకుండానే
కస్టమర్ కి పరుపైనప్పుడు
ఒకడికి ముగ్గురు కుక్కలై
నల్లిలా నలిపినప్పుడు
తాగినోడు జుట్టీడ్చి తన్నినప్పుడు..
వెగటు వేషాలేసినప్పుడు..
ఆడుతూ పాడుతు చిందాడే వయస్సులో
అవాంచిత గర్భం దాల్చినప్పుడు..

ఏమైందో అర్ధం కాక పిచ్చిచూపులు చూసినప్పుడు
అప్పుడు పట్టని ఓ పాలకా..! ఇప్పుడు నీకింత ప్రేమోంటో..?
ఒడలు, కాలిన సిగిరెట్ల కు యాష్ ట్రేగా మారినప్పుడు
మెడుకు, ఉచ్చువేసి వెర్రినాకొడుకులు మూత్రం తాపినప్పుడు
నగ్నంగా వేలాడదీసి వీడియోలు తీసినప్పుడు..
వద్దన్నా వినకుండా రక్షణ తొలిగించి రమించినప్పుడు
కోతి చేష్టలతో చేష్టలుడిగి.. కోతి రోగాలల్లుకున్నప్పుడు
చీకి చీకి చిక్కి శల్యమై అందాల భామ
ఈగల ఆవాసమైనప్పుడు
తనతో కులికినోళ్ళళ్ళా, నోరెళ్ళబెట్టి వెళుతూ
తానెవ్వరో తెలీయనట్లు ..నటులైనప్పుడు ..

అప్పుడు గుర్తురాని మా పాపపు జీవితాల్లో ...
మా కుళ్ళిన బ్రతుకుల్లో ..
వెలుగు నింపేందుకు మాకు లైసెన్సులిత్తారా??
మేము ట్యాగులేసుకుని తిరగాలా?
చట్టం ఉంటేనే, చుట్టంగా మార్చుకున్న మీకు
మా పై ఇంత ప్రేమేంటో??
బాండ్లు రాసి ఆంటీలకు అమ్ముడవ్వాలా??

మీ దారేంటో కాస్త తెలుసుకో.. !
మాకేం కావాలో అడిగి తెలుసుకో ..!
జనాల మనసుల్లో ఏది గూడైందో వెతుకు ఫో..!

నిశి కమ్మిన జీవితాలకు
వెలుగుబాట కాకున్నా మేలేన్నా..
దీపంపురుగుల్లా మార్చొద్దు.
మలమల మాడ్చొద్దు..
మమ్ము ఏమార్చవద్దు..

                    - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                         - 08.11.2014

No comments:

Post a Comment