Tuesday, 3 March 2015

మూఢాచారాలా..?? ఎలా?? - 1. ముండమోపి ఎదురైతే ఏంజరుగుతుంది...??

మూఢాచారాలా..?? ఎలా?? - 1
              - కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల

1. ముండమోపి ఎదురైతే ఏంజరుగుతుంది...??



                ఈ మధ్య సినిమాల్లో  ఒక కొత్త పోకడ మొదలైంది..   ఒకరి .. వెనుక ఒకరన్నట్లు.. దగ్గర దగ్గర ఒకే కథను అటు తిప్పి ఇటు తిప్పి తలోకటి చూపిస్తున్న్నరు.. హిందీ చిత్రాలు, తెలుగు, తమిళ చిత్రాలు.. ఒకటి కాదు అన్నీ భాషల్లో ఇదే లేటెస్ట్ ట్రెండ్.. స్వాముల్ని అడ్డం పెట్టూకుని ఒక మతాన్ని టార్గెట్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ మధ్య మధ్యలో ఒక డైలాగ్ ఇతర మతాల గురించి కూదా ఉండేలా జాగ్రత్త పడ్డారు కానీ..

ఇక్కడ మన చర్చనీయాంశమేమంటే.. వాళ్ళు ఏవి చూపిస్తున్నా.. వారడిగే వాటికి సమాధానం లేదా..? మన అనుకునే సంస్కృతికి విఘాతం జరుగుతున్నప్పుడు మనం అన్న మారాలి.. సమాధానం అన్న చెప్పి తీరాలి .. ఆవిధంగా ప్రయత్నంచాలన్నదే ఈ టపా ఉద్దేశ్యం.

 ఈ మధ్య ఓ చిత్రం చూశా..! మూఢాచారాలు మూఢ నమ్మకాలు అంటూ... సాగిందా చిత్రం.. ఆ తర్వాత దేవుడిని తెచ్చి ఏదో చెప్పించే ప్రయత్నం చేసినా  ఆ రచయిత ప్రశ్నలకు సమాధానం  ఇక్కడ ముఖ్యం..   అనవసరంగా కాలం మారినా వస్తున్న ఆచారాలైతే మానాల్సిందే..! మరి


సరే నేనే ఓ ప్రశ్న వేస్తున్నా??

ముండమోపి ఎదురైతే.. వచ్చిన నష్టమేంటి..??

ప్రశ్న రెండో సారి.. ముండమోపి ఎదురొస్తే ఏమౌతుంది...                                                            


ఇది మూఢాచారమా..! ఆచారమా??

నేను ఆనాటి మంచి ఆచారం అంటాను.

మనం అర్ధం చేసుకోవడంలో, పెడత్రోవ వల్ల కలిగిన నష్టం  నాస్తికుల చేతికి వరమైంది...

హిందూ ధర్మ సిద్దాంతాల్లో ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి .. పదుగురు ఆమోదించిన వాటినే  ...ఆచారాలుగా వ్యవహరించబడ్డాయని నేను నమ్ముతాను..  (ఆనాటి చట్టాలకు లోబడి కొన్ని ఉండొచ్చు .. అలాంటివి రూపుమాపాలి..నేటి చట్టాలకు లోబడి .. పరిస్థితులకు లోబడి మారాల్సి ఉంది.. దీనిలో ఏమాత్రం డిస్కషన్స్ లేవు )

 కానీ అన్నీ మూఢాచారాలు కావు.. వాటికి అప్పటి కాల మాన పరిస్థితులు.. మాత్రమే కారణం.

సరే ప్రశ్న మరోసారి క్షుణ్ణంగా పరిశీలీంచండి

"ముండమోపి ఎదురొస్తే నష్టం ఏంటి..?"
ఇదిగో అదే ప్రశ్న మరలా ఇక్కడే జాగ్రత్త...

" ముండమోపికి మనం ఎందుకు ఎదురెళ్ళకూడదు.?" ఇదీ వెయ్యల్సిన ప్రశ్న..

"అవును.. ఆ మహా తల్లికి మనం అనే వెధవలం ఎదురెళ్ళకూడదు కానీ.. ఆమె మనకి ఎదురు రావచ్చు.. ఇదీ నా సమాధానం.."

కారణం కుడా చెప్పాలి కదా.. ఇదిగో చెబుతున్నా..."

1.ఇదివరలో మన సంస్కృతి ప్రకారం స్త్రీకి చిన్ననాటే వివాహం చేసేవారు..

2. స్త్రీ భర్త వయసు రీత్యా చాలా పెద్దవారు అయ్యే అవకాశమే అధికం.

3. సదరు భర్త చనిపోయినప్పుడు ఆమెకు శిరోముడనం చేసి తెల్ల చీరెకట్టే వారు.. భర్త పోయిందన్న విషయానికి గుర్తయి ఉండొచ్చు.( ఈ ఆచారం ఇప్పుడు లేదు.. మంచి పరిణామం)

4. సదరు స్త్రీ చిన్న వయస్సులోనే భర్త ను పోగొకుని పుట్టెడు దుఖం తో ఉండి భర్త కోసం సాధ్విలా తపిస్తూ.. నిత్యం రోదిస్తున్న సమయంలో ఒక అందమైన జంట.. మరింత అందం గ ముస్తాబై  ఆమె కి ఎదురొస్తే..
5.అమెకి తన కొద్ది రోజుల క్రితమే వివాహమై తన్ జీవిత భాగస్వామి గుర్తొస్తే..
6. ఆమె మనసు మరింత క్షోభిస్తుందనేది ఎవ్వరైనా ఇట్టే చెప్పొచ్చు. అవునా కదా..?

    అందుకే ఆమెకి మనం ఎదురెళ్ళకూడదన్నరు కానీ.. ఆమె రావటం వల్ల మనకే ప్రమాదమూ లేదని గుర్తుంచుకోండి..
మనం చేసే పిచ్చి చేష్టలకి .. తెలియని తనానికి మన పూర్వీకులుచెప్పిన జాగ్రత్తలు అనవసరంగా ప్రక్కదోవపట్టడం వల్ల అంతటి మహానుభావులకి చెడ్డపేరు తేవడం తప్ప వేరొకటి కాదు.. దయచేసి  ఇలాంటి చక్కటి హైందవా ఆచారాల అసలు విషయాల గుట్టు  విప్పే  ప్రయత్నంలో మీరూ భాగస్వాములు కండి.. మీ ఆలోచనలను నాతో పంచుకోండి.. మీ కేదన్నా ఆచారవ్యవహారాల మీద ఇలాంటి దృష్టికోణం ఉంటే తెలియచేయండి.. నాకు పర్సనల్ గా ఐనా మెసేజ్ చెయ్యండి. మరి కొన్నిటి పై త్వరలో చర్చిద్దాం.

                                             -          మీ కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల
                                                                                                20.01.2015

                   
https://www.youtube.com/watch?v=BCknHCgKmTg

Wednesday, 25 February 2015

దేశం లోనే గొప్ప ఆలయం ఇదేనేమో..?

     ఎంతో విశాల దృక్పధానికి ఆలవాలమైన ఈ ఆలయం ని దర్శించుకున్న వాళ్ళేవరన్నా ఉంటే వారి కాళ్ళు మ్రొక్కాలని వుంది.
ఇంతకీ ఇదేం ఆలయమో ఎవరైనా చెబుతారా?? 







గుర్తుపట్టారా?

??

???

???

????

?????
ఇది దేవాలయం అనుకుంటే అడుసు తొక్కినట్లే.. అంతకన్న పవిత్రమైనదే మరి..??

.....
.....

......


....

....

.........

ఇది ఒక ముద్రణాలయం...

*************
******************
***********************
*****************************
***********************
******************
*************








        భారతీయత.. భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతూ... కేవలం భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం స్థాపించబడి 92 ఏళ్ళు గా అవిరళ కృషి చేస్తున్న ధార్మిక సంస్థ గీతా ప్రెస్. ప్రపంచంలో అత్యధికంగా హిందూ సంబంధమైన పుస్తకాలు అనేక భాషల్లో అతి తక్కువ ధరకే అందిస్తున్న సంస్థ ఇది. నిజంగా దేవాలయాన్ని తలపిస్తున్న ఈ గీతా ప్రెస్ 1923 ఏప్రియల్ 29 న జయదయాళ్ గోయంక ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో స్థాపించారు. వీరి ఆధ్వర్యంలో గీతాప్రెస్, గోవిందభవన్ ,  గీతా భవన్, వేదపాఠశాల, ఆయుర్వేదిక్ ఔషదాలయ  సేవాదళ్ వంటి సంస్థలు ద్వారా అనేక ప్రాంతాలలో   హిందూ సంస్కృతికి కృషిచేస్తూ.. సనాతన ధర్మాల ఉనికిని కాపాడుతున్నారు. గీతా ప్రెస్ నుంచి పలు భాషల్లో వస్తున్న 'కళ్యాణ్ ' అనే పత్రికకు లైఫ్ టైం ఎడిటర్ గా తొలి ఎడిటర్ హనుమాన్ ప్రసాద్ పొద్దార్ గారి పేరే కొనసాగుతుంది. శ్రీమద్భగవద్గీత, రామాయణం, దుర్గా సప్తసతి, పురాణ , ఉపనిషత్తుల వంటి పుస్తకాలు ఇప్పటి వరకూ 370 మిలియన్ కాపీలను ఈ సంస్థ ప్రచురించింది. అయినా సరైన గుర్తింపుకు నోచుకోక పోవడం దురదృష్టం కదా..//

నమోస్తు గీతా ప్రెస్
నమోనమ: గీతాప్రెస్
నిత్య సేవికా వందనం
నిరంతర శ్రామికాభివందనం

               - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                           26.02.2015

Tuesday, 24 February 2015

స్వరములు ఏడు.. మరి....రాగాలెన్నో తెలుసా..?

స్వరములు ఏడు.. మరి....రాగాలెన్నో తెలుసా..? 
                                               - - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                         24.02.2015 


అవి చతుర్వింశతి రాగాలు .. అంటే  24  అన్నమాట. అవికూడా స్త్రీ రాగాలు


1. బిలహరి రాగము    
2. భాండి రాగము
3. హితదో రాగము
4. భల్లాతి రాగము
5. దేశి రాగము    

6. లలిత రాగము
7. వరాళి రాగము
8. గౌళ రాగము
9. ఘూర్జర రాగము
10. జౌళి రాగము
11. కళ్యాణి రాగము
12. అహిరి రాగము

 
13. సావేరి రాగము
14. దేవక్రియ రాగము
15. మేఘరంజి రాగము
16. కురంజి రాగము
17. మళహరి రాగము
18. కాంభోజి రాగము
19. నాహుళి రాగము
20. ముఖారి రాగము
21. రామక్రియ రాగము
22. గండక్రియ రాగము
23. ఘంటారవ  రాగము
24. శంకరాభరణ రాగము


         ఇన్ని రాగాల్లో నాకు మాత్రం ఒక్క రాగమూ రాదు .. నాకొచ్చిన రాగం వీటిలో లేదు .. ఏంచెయ్యలి చెప్మా..? అది ఏమి రాగమో చెప్మా..? అన్నట్లు ఇవన్నీ స్త్రీ రాగాలైతే పురషరాగాలేవిటి?? ఏవిటో అప్పట్లో అంతా పురుషాహంకారులన్నారు గానీ వాళ్ళూ స్త్రీ పక్షపాతులేనండోయ్..

Thursday, 19 February 2015

ఒకరెంట మరొకరు

//ఒకరెంట మరొకరు//
                                                                    - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                   19.02.2015






పోండి..అందరూ వెళ్ళిపోండి.
మమ్మల్ని ఏకాకుల్ని చేసి..
మా అంతరాల్ని మీ రూపంతో నింపేసి





మీరు గీసిన గీతల్లో
మీరు వ్రాసిన మాటల్లో
మీరు తీసిన చిత్రాల్లో
మిమ్మల్ని చూసుకోమంటూ..
ఒక్కొక్కరుగా వెళ్ళిపోండి..



మీభావాల రెక్కలేరుకుని
సిగన పెట్టుకుంటాం
పుస్తకాల నడుమ నెమలీక బదులో
మనసులో ప్రేమమూర్తి బదులో
మది దేవళంలో దేవతల బదులో
మిమ్ము పదిలంగా దాచుకుంటాం..


నిత్యం అభిమానపు పూలు
మాలగ జేసి అర్చించుకుంటాం..

మీరు లేరన్నది ఒట్టి భౌతికం..
మీ జ్ఞాపకం శాశ్వతం..

మీరు ఆకాశాన నిత్యం మెరిసే
నక్షత్రం..
ఒకరినొదిలి ఉండలేక
మరొకరు..
వరుసగా
ఒక్కొక్కరుగా..!!!

 






(మనసు భారమౌతోంది.. బాలచందర్ , అక్కినేని, దగ్గుబాటి సినీదిగ్గజాలు. బాపు..రాగతిపండరి వంటి ఉద్దండ కార్టూనిస్టులు.. . అందరూ ఒకరెంట మరొకరుగా... అడుగులోన అడుగేసుకుంటూ...కన్నీళ్ళు మిగిల్చి)

Wednesday, 18 February 2015

ఎవడు కనిపెట్టేడో గానీ..???

// ఎవడు కనిపెట్టేడో గానీ..???//

                              - కరణం కళ్యాణ్ కృష్ణకుమార్
                                                     19.10.2014


                    
               కమ్మగా ఎర్రెర్రని ఆవకాయకి , కాస్త పప్పొడి కలిపి, చారెడు నెయ్యి అద్ది, పెద్దపెద్ద ముద్దలు చేతిలో పెడుతున్న అమ్మమ్మ గుర్తొంచిందీ రోజు... !
            అసలు ఆ ముద్ద మహత్తో.. అమ్మమ్మ చేతి చలవో... ఆవకాయలో ని రుచి మహిమో గానీ.. ఆ ముద్ద రుచి నాలికకు తగిలిన వాడు జన్మలో మరిచిపోలేడు.. ఇది మాత్రం సత్యం.. సాంబ  డైరీ లో రాసుకున్నా రాసుకోకపోయినా ఇది 100 శాతం వాస్తవం.                 దీనిపై కాస్త ..మరికాస్త.. మరింత లోతుగా ఆలోచిస్తుంటే.. అసలు ఆవకాయలోనే ఆ మహిమ ఉన్నదనిన్ని.. దానికి అమ్మమ్మ ప్రేమ, తిరుపతి లడ్డంత అందమైన ముద్ద మధురంగా మారాయని తెలుస్తోంది. ఘాటుకి కన్నీళ్ళు కారుతూ... సుస్..సుస్.. అంటూ .. తింటూ లొట్టలేసుకుంటూ.. ముద్ద కోసం పోటీపడి కొట్టుకుంటూ, వారేవా ! ఆ రోజులే వేరు కదూ.. పాపం పసివారు.. ఈ రోజుల్లో పిల్లలకి ఇలాంటివి ఒకటుంటాయని తెలీదు.. కొన్ని రోజులైతే ఊహకూడా ఉండదు.. అతనెవరో ఫారెనరు... పూరీలోకి గాలి ఎలా పంపారబ్బా ఇండియన్స్ అని సోచాయించాడంట// మన పిల్లలూ అలా కొన్నాళ్లకు తయారవుతారని .. మన మోత బరువు పుస్తకాలే శెలవిస్తున్నాయ్ అనుకోండి.
  ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకనేగదా మీఫేసు ఫీలింగ్.. అక్కడికే కమింగు..


ఎన్నో ఏండ్లు గతించి పోయినవి గానీ.. అల ఆవకాయ చేసిన వారెవరో తెలియక పాయనే..!

ఎంచక్క ముక్కలు కొట్టి.. ఆవపిండి తయారు చేసి, కారం వేసి.. అబ్బబ్బ చేసేటప్పుడే ఒళ్ళు పులకరించిపోతుందంటే.. ఆహా ఏమిరుచి.. తినరామైమరచి.. రోజూతిన్నా కానీ మోజే తీరనిది అన్న పాట గుర్తొస్తుందనుకోండి..

రెండు నుంచి వారం రోజుల్లో కుళ్ళిపోయి, పాడైపోయి, దేనికీ పనికి రాకుండా పోయే మామిడి లేదా ఇతరాలు, ఏదైనా ఏళ్ళతరబడి పాడైపోకుండా ఉండటానికి ఎన్నిరకాల ప్రయోగాలు చేశారో.. ఎంతమంది మృత్యువాతపడ్డారో.. అని అనిపిస్తుంటుంది ఒకోసారి...

       మనకు బుద్ధి పుట్టినప్పటి నుంచీ చూస్తున్నాం.. ఏ ఫారెన్ ఐటం అయినా... నెల రోజుల మించి స్టాక్ ఉంటుందా...???
          అంటే నిన్న వచ్చిన హుద్ హుద్ లాంటి ప్రకృతి వైపరీత్యాలూ... ఇంటిల్లిపాదీ పనీ పాట చేసుకోని బ్రతకడాలు వంటి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేందుకు మన భారతీయ పాకశాస్త్ర ప్రావీణ్యులు కనిపెట్టిన స్టాక్ ఫుడ్ లాంటివి ఇంతవరకూ ఎవ్వరూ కనిపెట్టలేదనే నాకనిపిస్తోంది..!  మనకు తెలియని వెక్కడన్నా ఉన్నాయేమో గానీ , విన్నంతవరకూ అదీ పరిస్థితి..

ఆ తర్వాత అనేకరకాల ఆవకాయలు చేశారనుకోండీ, మన ఇంటి దేవతలు..
    ప్రయోగాలకు పుట్టినిల్లు వంటిల్లేనని ఇదే ఋజువుచేస్తోంది మరి.. కాదని అనగలరా..!

     ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఆవకాయ కనుక్కున్న ఆ మహానుభావుడో, మహానుభావురాలో ఎవరైతే వారికి ఒక్క నమస్కారం పెట్టుకుని .. ఎంచక్కా ఆవకాయ లాగించేయండోయ్..ఈ మధ్య అదేదో వచ్చింది... లేటెస్ట్ ఆవకాయ్ బిర్యానీ ట..! ఆదివారం వారు అదీ కూడా లాగించి..

ఆవకాయ టేస్ట్ ను వేస్ట్ ఫెలోస్ కి చెప్పి, పేస్ట్ మొఖాలూ ఇది ఇండియన్ బెస్ట్ అనిన్ని.. అసలు వరల్డ్ ఫస్ట్ అనిన్ని ప్రచారం చేయండి.. పేటెంటుకి ఏ విదేశీ సంస్థో పోటీ పడుతుందేమో ఓ కన్నేసుంచండి...! 

అదండి సంగతి.!  సందట్లో సడేమియాగా మీరూ ఎంచక్క ఉత్తపప్పు.. అదే సుద్ధ పప్పు లో నో.. కందిపచ్చడిలోనో పప్పొడిలోనో , ఆవకాయ కలుపుకుని, నెయ్యేసుకుని  కమ్మగా ముద్దలు లాగించేయండే..!

Monday, 16 February 2015

నిను వర్ణింప తరమా..!

నిను వర్ణింప  తరమా..!
                             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                  14.2.2015

అల చల్లనిగోదారి  అలలపై
ఇల  నావయ్యారిభామ తో
నడిరేయి నావ పై విహరించగ..,
మెల మెల్లగ కదిలే లహరి తరగలపై
మిల మిల  మెరిసే
వేవేల  చంద్రాబింబాల నడుమ

తెల తెల్లని చీరె కట్టి,
మరు మల్లియలు సిగను చుట్టి..
చల చల్లని గాలికి ఎగిరే ముంగురులతో..
ధగ ధగ ధవళ కాంతులీను..
నా కన్నులకలికి  సౌందర్యం కాంచి..



తిమిరమున
వేవేల నక్షత్రాల నడుమ..
కౌముది కౌగిట మురిసేటి  ఆ హిమసఖుడు
మరుచంద్రుడుదయించెనని భ్రమించెనో..
ఉషోదయమాసన్నమైనదని భ్రాంతి నొందెనో

నా ప్రణయిని చూసి ఉలిక్కి పడి
వడి వడిగ మేఘాల మాటున నక్కెనే.. 
ఓ నీరజారీ.!  నీ నవ్వులకు
ఆ తొగచెలికాడు తొందరపడి  తొలగిపోయెనే!

ఓ చెలి ,నా సహచరి ..!
నీ సౌందర్యం ఏమని వర్ణింతునే..!!

 

(లహరి = అల ,  ధవళ కాంతి = తెల్లని వెలుతురు,   కౌముది = వెన్నెల,
 కన్నుల కలికి=నీరజారి= ప్రణయిని= సహచరి = చెలి,  తొగ చెలికాడు = హిమసఖుడు = చంద్రుడు , తిమిరము = రాతిరి= చీకటి)

                   

Sunday, 15 February 2015

గణణక్కాయ్.....వేడి పొయ్యి (సరదాకి..)


 సరదాకి....


// గణణక్కాయ్.....వేడి పొయ్యి.//
                         కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                      14.02.2015                   






“సంస్కారవంతమైన నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం ..
మస్కా నమస్కారాలకి తిరస్కారం మన ప్రధమ కర్తవ్యం..”

ఇంతకీ ఇంత గొప్పదైన ఈ మాట చెప్పిందెవరా అని అలోచిస్తున్నారేటీ.. వద్దు.. మీ బుర్రకి పదునెట్టొద్దద్దు..ఎవరన్నరో నేను చెప్పేలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.. చిటికెలో వచ్చేద్దాం..  చిటికన్నా.. ...చిటికిన వ్రేలని చెప్పొచ్చుగా అని ఓ లోలోన తిట్టుకుంటున్నార్లేండీ.. నాకు తెలుసులే..!

   చీటికి మాటికీ నన్నాడిపోసుకోవడం తప్ప వేరేపన్లేదు మీకు... ఆయ్.. చిటికో,  ఛిటీకిన వేలో ఏదోటి ..మళ్ళొస్తానన్నగందా..!
గందా.. అంతే హింది గందా కాదు నాయనా.. కదా అని.. మళ్ళీవస్తానన్న కదా..!

 ఆ వచ్చే వచ్చే.. ఓపికపట్టు..   

  ఒకే బ్యాక్ నుంచి పెవిలియన్ కి.. వెల్ కం టూ తెలివైనోడు..

  సరే మనం  "సంస్కారవంతమైన నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం
మస్కా నమస్కారానికి తిరస్కారం మన ప్రధమ కర్తవ్యం" అని  ఎవరన్నారో తెలుసుకునే ముందు...

అసలు పెవిలియన్ అనే పదం ఎక్కడవాడతారో తెలుస్సా..

అరె.. ఎంతబాగా గంగిరెద్దల్లే తలూపాడో హహహ ఎ..క్క..డా??.

క్రికెట్ లో..

వా.. వా. ఏంసెప్తిరి ఏం సెప్తిరి..!!

క్రికెట్ కు మూలం ఏ ఆటో తెలుస్సా..??
ఆ..ఆ..ఆ
అర్రె అర్రె మళ్లీ ఊపాడితను బుర్రే.. బుర్ర

హబ్బ..హబ్బ ఏం ఊపారండి.. మళ్ళీ మీరు తలూపేస్తుంటే.. క్యాష్ కరిపోద్దని కంగారౌద్ది నాకు .. హహహ

కోడుం బిళ్ళా..

సెబ్భాష్.. మీకు చాలా తెలుసు..  దానే బిళ్ళంకోడు అంటారు ఆంధ్రోళ్ళు..

హహహ

సరే మరి అసలు ప్రశ్న దగ్గరికొచ్చేద్దాం...

  సరే మనం  “సంస్కారవంతమైన నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం
మస్కా నమస్కారానికి తిరస్కారం మన ప్రధమ కర్తవ్యం” అని ఎవరన్నారో తెలుసుకుందామా.. ?

గణణక్కాయ్...

ఓ గణనక్కయ్.. నీ తాన నక్కిపెట్టిన సమాధానాలు నాలిగిచ్చుకో
గిచ్చుకో అంటే.. గిచ్చి ..సంపి పారేయమని కాదు గణణక్కయ్..

సమాధానాలు ఇచ్చుకో..

వాకే

A. కె                        B. కెకె
C. కెకెకె                    D. కెకెకెకె

పది రూపాయల ప్రశ్న..

పంది కాదు బాబూ.. కంగారు పడొద్దు.. హహహ
నీ కంగారు సూత్తే నాకు కంగారౌద్ది..

పది రూపాయల ప్రశ్న..
ప్రశ్న అర్ధమైంది కదూ..

"  సంస్కారవంతమైన నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం
మస్కా నమస్కారానికి తిరస్కారం మన ప్రధమ కర్తవ్యం” ఎవరన్నారు?

సమాధానం తెలుసా.. మీకు తెలుసు.. అదిగో ఊపుతున్నారు.. ఊపేస్తున్నారు..  ఊపేశారు..
అరె అరె అరె మళ్లీ ఊపేశారు.. ఆడియన్స్ పెద్దగా తప్పెట్ట్లు

ఒక్క నిమిషం.. తప్పెట్లు కొట్టే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.. చీటిఖేసి వచ్చేద్దాం..

సారు... నాకూ చిటికినేలు పిలుత్తాంది...

అరె మీరూ నాలాగే..!! షుగరేమన్న ఉందా..?

సారూ చిటికినేలు సూపించాగందా.. ?

సరే ఆడియన్స్ సూత్తూ ఉండండి.. చిటికేసొచ్చేత్తాం...
మీలో ఎవర్రన్న ఛిటికేయాలన్నా.. చిటికిలో పూర్తిసేసి వచ్చేయండి..

వెల్ కం టూ పెవిలియన్

హహహ
ప్రశ్నకు సమాధానం  తెలుసుకుందామా..?

చెప్పండి మీ పదిరూపాయల ప్రశ్నకు సమాధానం..చెప్పండి

బి..
కెకె
కాదుకాదు.. అవునేమో
డి.. అవుననుకుంటా. కానీ కాదు
ఎ.. మోస్ట్లీ అయ్యే ప్రమాదం ఉంది
సి.. అయ్యే చానెస్స్ కొద్దిగా ఉన్నయ్..

వీడేంటీ అన్నీ సమాధానాలు చెప్తున్నాడు..

మీరు ఒకే సమాధానం చెప్పాలండీ..!  మీరు అన్నీ చెప్పేసి క్యాష్ పట్టూకెళ్తే.. నెక్స్ట్ వాళ్ళకి నేను చిప్ప ఇవ్వాల్సుంటుంది.. ఆ

"బి"

ఫైనలా?
కం ఫం..??
లాక్ చెయ్యనా..??
గణణక్కాయ్.. లాక్ చెయ్..!

బ్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్

అయ్యో ఈ రోజు గణణక్కాయ్ టైం అయిపోయింది..
సమాధానం మీకు తెలిస్తే సెప్పండి.. పొయ్యి పైన కూర్సోండీ.. మీరు సెయ్యాల్సిందళ్ళా.. కామెంట్ పెట్టడమే.. సమాధానం  తెలిసిన అచ్చంగా తెలుగు వారు కామెంట్ పెట్టొచ్చు.. పొయ్యి ఎక్కొచ్చు.. కమాన్

ప్రేమికుల 'దినం.. పెట్టిన' రోజు శుభాకాంక్షలు.. లవ్యూ ఆల్.!!!