Tuesday 3 March 2015

మూఢాచారాలా..?? ఎలా?? - 1. ముండమోపి ఎదురైతే ఏంజరుగుతుంది...??

మూఢాచారాలా..?? ఎలా?? - 1
              - కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల

1. ముండమోపి ఎదురైతే ఏంజరుగుతుంది...??



                ఈ మధ్య సినిమాల్లో  ఒక కొత్త పోకడ మొదలైంది..   ఒకరి .. వెనుక ఒకరన్నట్లు.. దగ్గర దగ్గర ఒకే కథను అటు తిప్పి ఇటు తిప్పి తలోకటి చూపిస్తున్న్నరు.. హిందీ చిత్రాలు, తెలుగు, తమిళ చిత్రాలు.. ఒకటి కాదు అన్నీ భాషల్లో ఇదే లేటెస్ట్ ట్రెండ్.. స్వాముల్ని అడ్డం పెట్టూకుని ఒక మతాన్ని టార్గెట్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ మధ్య మధ్యలో ఒక డైలాగ్ ఇతర మతాల గురించి కూదా ఉండేలా జాగ్రత్త పడ్డారు కానీ..

ఇక్కడ మన చర్చనీయాంశమేమంటే.. వాళ్ళు ఏవి చూపిస్తున్నా.. వారడిగే వాటికి సమాధానం లేదా..? మన అనుకునే సంస్కృతికి విఘాతం జరుగుతున్నప్పుడు మనం అన్న మారాలి.. సమాధానం అన్న చెప్పి తీరాలి .. ఆవిధంగా ప్రయత్నంచాలన్నదే ఈ టపా ఉద్దేశ్యం.

 ఈ మధ్య ఓ చిత్రం చూశా..! మూఢాచారాలు మూఢ నమ్మకాలు అంటూ... సాగిందా చిత్రం.. ఆ తర్వాత దేవుడిని తెచ్చి ఏదో చెప్పించే ప్రయత్నం చేసినా  ఆ రచయిత ప్రశ్నలకు సమాధానం  ఇక్కడ ముఖ్యం..   అనవసరంగా కాలం మారినా వస్తున్న ఆచారాలైతే మానాల్సిందే..! మరి


సరే నేనే ఓ ప్రశ్న వేస్తున్నా??

ముండమోపి ఎదురైతే.. వచ్చిన నష్టమేంటి..??

ప్రశ్న రెండో సారి.. ముండమోపి ఎదురొస్తే ఏమౌతుంది...                                                            


ఇది మూఢాచారమా..! ఆచారమా??

నేను ఆనాటి మంచి ఆచారం అంటాను.

మనం అర్ధం చేసుకోవడంలో, పెడత్రోవ వల్ల కలిగిన నష్టం  నాస్తికుల చేతికి వరమైంది...

హిందూ ధర్మ సిద్దాంతాల్లో ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి .. పదుగురు ఆమోదించిన వాటినే  ...ఆచారాలుగా వ్యవహరించబడ్డాయని నేను నమ్ముతాను..  (ఆనాటి చట్టాలకు లోబడి కొన్ని ఉండొచ్చు .. అలాంటివి రూపుమాపాలి..నేటి చట్టాలకు లోబడి .. పరిస్థితులకు లోబడి మారాల్సి ఉంది.. దీనిలో ఏమాత్రం డిస్కషన్స్ లేవు )

 కానీ అన్నీ మూఢాచారాలు కావు.. వాటికి అప్పటి కాల మాన పరిస్థితులు.. మాత్రమే కారణం.

సరే ప్రశ్న మరోసారి క్షుణ్ణంగా పరిశీలీంచండి

"ముండమోపి ఎదురొస్తే నష్టం ఏంటి..?"
ఇదిగో అదే ప్రశ్న మరలా ఇక్కడే జాగ్రత్త...

" ముండమోపికి మనం ఎందుకు ఎదురెళ్ళకూడదు.?" ఇదీ వెయ్యల్సిన ప్రశ్న..

"అవును.. ఆ మహా తల్లికి మనం అనే వెధవలం ఎదురెళ్ళకూడదు కానీ.. ఆమె మనకి ఎదురు రావచ్చు.. ఇదీ నా సమాధానం.."

కారణం కుడా చెప్పాలి కదా.. ఇదిగో చెబుతున్నా..."

1.ఇదివరలో మన సంస్కృతి ప్రకారం స్త్రీకి చిన్ననాటే వివాహం చేసేవారు..

2. స్త్రీ భర్త వయసు రీత్యా చాలా పెద్దవారు అయ్యే అవకాశమే అధికం.

3. సదరు భర్త చనిపోయినప్పుడు ఆమెకు శిరోముడనం చేసి తెల్ల చీరెకట్టే వారు.. భర్త పోయిందన్న విషయానికి గుర్తయి ఉండొచ్చు.( ఈ ఆచారం ఇప్పుడు లేదు.. మంచి పరిణామం)

4. సదరు స్త్రీ చిన్న వయస్సులోనే భర్త ను పోగొకుని పుట్టెడు దుఖం తో ఉండి భర్త కోసం సాధ్విలా తపిస్తూ.. నిత్యం రోదిస్తున్న సమయంలో ఒక అందమైన జంట.. మరింత అందం గ ముస్తాబై  ఆమె కి ఎదురొస్తే..
5.అమెకి తన కొద్ది రోజుల క్రితమే వివాహమై తన్ జీవిత భాగస్వామి గుర్తొస్తే..
6. ఆమె మనసు మరింత క్షోభిస్తుందనేది ఎవ్వరైనా ఇట్టే చెప్పొచ్చు. అవునా కదా..?

    అందుకే ఆమెకి మనం ఎదురెళ్ళకూడదన్నరు కానీ.. ఆమె రావటం వల్ల మనకే ప్రమాదమూ లేదని గుర్తుంచుకోండి..
మనం చేసే పిచ్చి చేష్టలకి .. తెలియని తనానికి మన పూర్వీకులుచెప్పిన జాగ్రత్తలు అనవసరంగా ప్రక్కదోవపట్టడం వల్ల అంతటి మహానుభావులకి చెడ్డపేరు తేవడం తప్ప వేరొకటి కాదు.. దయచేసి  ఇలాంటి చక్కటి హైందవా ఆచారాల అసలు విషయాల గుట్టు  విప్పే  ప్రయత్నంలో మీరూ భాగస్వాములు కండి.. మీ ఆలోచనలను నాతో పంచుకోండి.. మీ కేదన్నా ఆచారవ్యవహారాల మీద ఇలాంటి దృష్టికోణం ఉంటే తెలియచేయండి.. నాకు పర్సనల్ గా ఐనా మెసేజ్ చెయ్యండి. మరి కొన్నిటి పై త్వరలో చర్చిద్దాం.

                                             -          మీ కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల
                                                                                                20.01.2015

                   
https://www.youtube.com/watch?v=BCknHCgKmTg

4 comments:

  1. నా మనసులోని భావమే మీరు చెప్పారు. భర్త లేని స్త్రీ గురించి సమాజంలో ఉన్న భావాలకు ... నా మనసులో 100 శాతం మీరు ఉదహరించిన భావమే ఉన్నది. నమస్సులు కుమార్ గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి శర్మ గారు

      Delete
  2. నిజమే మంచి సమాధానం చెప్పారు. మీ సమాధానం భారత ప్రజల సంకుచిత ఆలోచన దోరనిని అద్దం పడుతుంది..
    భాదలో ఉన్న వారిని బదించడం తప్పు అంటున్నారు కదా..
    1 స్త్రీ కి చిన్న వయసు లో వివాహం చెయ్యటం మొదట తప్పు...
    2 స్త్రీ భర్త వయస్సులో పెద్ద అయి ఉండాలి అనే నిబందన శుద్ధ దండగ.
    3 మరి మొగడు చచ్చిన స్త్రీ కి గుండు కొట్టించి బాధ పెట్టడం తప్పు కాదా ? అసలు గుండు కొట్టించి తెల్ల చీర కట్టె అవసరం ఏం ఉంది ?
    4 ఒకవేళ చచ్చిన వాడు గుర్తొస్తే మరిపించేలా చేయాల్సిన సమాజమే హేళన చేస్తే, ఎవరు తోడుగా నిలుస్తారు ?
    పనికిమాలిన ఆచారాలను మన సంస్కృతి అని చెప్పడం సిగ్గు గా ఉంది సర్. చదువు కున్న వాళ్ళు కాస్త ఇంగిత జ్ఞానం తో ఆలోచించండి. అలా చేత కాకపోతే ఇంట్లో కూర్చొని చిన్నారి పెళ్లికూతురు సీరియల్ చూడండి. మీ ఆలోచనా విదానం కొంచెం అయినా మారుతుంది....

    ReplyDelete
    Replies
    1. కొంతకాలంగా ఫేస్ బుక్ లోకి రాకపోవటం వల్ల మీ కామెంట్ చూడలేకపోయానండీ.. సారీ.. ! నేను చెబుతోంది.. కుంచిత భావాలకు స్వస్తి చెప్పమనే నండి.. బహుశ మీరు పూర్తిగా చదవలేదో లేక అర్ధం చేసుకోవటంలో పొరబాటో.. అప్పుడెప్పుడో.. అప్పటి అచారాలు.. అనాచారాలుగా మారి ఉంటాయి.. వాటి వల్ల మీకు చెడు జరగదు కనుక మీరు వారు ఎదురొచ్చినంతనే తప్పుకొని వారిని (విడోస్ ని) కించపరచాల్సిన పనిలేదని చెప్పటమే ఇందులో ఉద్దేశ్యం.. నా రతలో మీకు ఏదైనా అర్ధం కాకపోయి ఉంటే క్షమార్హుడను. అప్పుడెప్పుడో ఎవరో చెప్పారని తెలిసీ తెలియకా ఆచారాల పేరుతో మూడంగా ప్రవర్తిస్తున్న వారికి అసలు ఇలా జరిగి ఉంటుంది.. రానురానూ మూర్ఖుల వల్ల దాని స్థితి మారుంటుంది.. కనుక మీరు ఆ దరిద్రపు ఆచారాన్ని కొనసాగించకండీ అనేదే నేను చెప్పిన అంశం ఉద్దేశ్యం.. దీనికోసం టీవిలో సీరియల్ చూసి సిగ్గుపడేపని చేయనఖ్కర్లేదండీ..సీరియల్లో అయినా అలా చూడటానికి నేను వ్యతిరేకిని.. నమస్తే..స్వస్తి

      Delete