Sunday 15 March 2015

మనుశాస్త్రం వడ్డీ గురించి ఏంచెప్పింది??

వడ్డీ ఎంత తీసుకోవాలి?? మను ధర్మం ఏం చెప్పింది??
                                              - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                    03.03.2015





మనం రోజూ పేపర్లోనో , టీవీల్లోనో చూస్తూ ఉంటాం.. సూక్ష్మ వడ్డి ఋణం ధాటికి విలవిల.. అనో బ్యాంకుల్లో వడ్డీ రేటు తగ్గింపనో..పెరిగిందనో .. ఇలా అనేకం డబ్బు వడ్డీ రూపంలో చేతులు మారటం చూస్తూ ఉంటాం. మరి వేలకు వేలు వడ్డీ వసూలు చేయడం అన్యాయం అని గొంతుచించుకున్నా.. ఎవ్వరూ వినే పరిస్థితి లేదు. అధిక వడ్డీ ముక్కు పిండి వసూలు చేసి జేబులు నింపుకోవడం ఇప్పుడు వడ్డీ వ్యాపారుల ఏకైక లక్ష్యం.   మరి మన సంస్కృతి లో వడ్డీ గురించి ప్రామాణీకమేమైనా ఉందా..? ఉంటే ఏం చెప్తోంది..?


మన ధర్మ శాస్త్రాల్లో ప్రామాణికం మనుధర్మ శాస్త్రం.  భారత రాజ్యాంగానికి ఇతర దేశాల రాజ్యాంగాల తో పాటూ మను ధర్మ శాస్త్రం కూడా ఉపయోగపడిందనటంలో సందేహం లేదు. మరి మన పాలిట ధనువైన మనువు వడ్డీ గురించి ఏమి చెప్పారంటే..


వశిష్ఠ విహితాం వృద్ధిం సృజేద్విత్త వివర్జినీం
అశీతి భాగం గృహ్ణీయాన్మాసాద్వార్దుషిక: శతే!!




  ఋణం మీద అత్యధికంగా వడ్డి ఎంత తీసుకోవచ్చో ఈ  శ్లోకం చెబుతోంది.  అత్యధికంగా నూటికి 80 వ వంటు అంటే వంద రూపాయలకి రూపాయై పావలా మాత్రమే వడ్డీ అత్యధికంగా తీసుకోవాలని మనువు తన ధర్మ శాస్త్రంలొ సూచించాడు.

ఆహా..! ఎంత దూర దృష్టి.. కదూ.. మనవాళ్ళు ముందు ముండు ముక్కు పిండుతారని అప్పుడే ఊహించారు మహానుభావుడు.. నమోస్తు మనువు.. మా పాలిట ధనువు.

1 comment:

  1. .... వంద రూపాయలకి రూపాయ పావలా మాత్రమే వడ్డీ అత్యధికంగా తీసుకోవాలని మనువు తన ధర్మ శాస్త్రంలొ సూచించాడు.....
    బాగుంది.. కాని సమయం నిర్దేశించలేదుగా! ఇప్పుడు వడ్డీ వ్యాపారులు మాత్రం ఏం ఎక్కువ వడ్డీ వసూలుచేస్తున్నారండి పాపం! అదే రూపాయిపావల తీసుకుంటున్నారు కాకపోతే కొందరు నెలకి, మరీ దయార్ద్ర హృదయులు రోజుకి వసూలు చేస్తున్నారు. మీరు ఊరికే ఆడిపోసుకుంటున్నారు.

    ReplyDelete