Wednesday, 28 May 2014

కౌరవులు @103

                                                                          కౌరవులు @103

కౌరవులు 103 మంది అని తెలుసా..? పాండవుల గురించి అడిగితే ఎవ్వరైన టక్కున సమాధానం చెప్తారు.మరి నూటొక్క మంది అని మనం నిత్యం చెప్పుకునే కౌరవుల పేర్లు మీకు తెలుసా..? ఇవిగో చూసి నేర్చేసుకోండి..ఇక్కడ మనం మరో విషయం గుర్తించాలి.. నేడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్న పద్దతే నాటీ కౌరవ జననం.. మహాభారత కాలంలోనే టెస్ట్ టుబ్ పద్దతిని కనిపెట్టరనటానికి నిదర్శనమే ఈ నూటొక్క మంది జననం.
ఇక విషయానికొద్దాం..
వ్యాసభారతం ఆదిపర్వం కౌరవుల పేర్లు చక్కగ వివరించారు.
జయమేజుడు "ప్రభూ! దృతరాష్ట్రుని నూరుగురు పుత్రుల పేళ్ళను జేష్ట క్రమంలో చెప్పవలసినది" అని వైశంపాయనుడిని కోరాడు. అంత వైశంపాయనుడిలా వారి పేర్లను చెప్పాడు.

                                                           
1. ధుర్యోధనుడు
2. యుయుత్సుడు
3. దు:శాసనుడు
4. దు:శలుడు
6. దుర్ముఖుడు
7. వివింశతి
8. వికర్ణుడు
9. జలసంధుడు
10.సులోచనుడు
11.విందుడు
12.అనువిందుడు
13.దుర్దర్షుడు
14.సుబాహువు
15.దుష్ర్పధర్షణుడు
16.దుష్కర్ణుడు
19. కర్ణుడు
20.చిత్రుడు
21.ఉపచిత్రుడు
22.చిత్రాక్షుడు
23చారుడు
24.చిత్రాంగదుడు
25.దుర్మదుడు
26.దుష్ర్పధర్ముడు
27.వివిత్సుడు
28.వికటుడు
29.సముడు
30.ఊర్ననాభుడు
32.నందుడు
33.ఉపనందుడు
34.సేనాపతి
35.సిషేణుడు
36.కుండోదరుడు
37.మహోదరుడు
37.చిత్రబాహువు
39.చిత్రవర్మ
40.సువర్మ
41.దుర్విరోచనుడు
42.అయోబాహువు
43.మహాబాహువు
44.చిత్ర చాపుడు
45.సుంకులుడు
46.భీమవేగుడు
47.భీమబలుడు
48.బలాకి
49.భీముడు
50.విక్రముడు
51.ఉగ్రాయధుడు
52.భీమశరుడు
53.కనకాయువు
54.దృఢాయుధుడు
55.దృఢవర్మ
56.దృధక్షత్రుడు
57.సోమకీర్తి
58.అనూదరుడు
59.జరాసంధుడు
60.దృఢసంధుడు
61.సత్యసంధుడు
62.సహస్రవాక్కు
63.ఉగ్రశ్రవుడు
64.ఉగ్రసేనుడు
65.క్షేమమూర్తి
66.అపరాజితుడు
67.పండితకుడు
68.విశాలాక్షుడు
69.దురాధనుడు
70.దృఢహస్తుడు
71.సుహస్తుడు
72.వాతవేగుడు
73.సువర్చసుడు
74.ఆదిత్యకేతువు
75.బహ్వాశి
76.నాగదత్తుడు
77.అనుయాయి
78.కవచి
79.నిషంగి
80.దండి
81.దండధారుడు
82.ధనుర్గ్రహుడు
83.ఉగ్రుడు
84.భీమరథుడు
85.వీరుడు
86వీరబాహువు
87.అలోలుపుడు
88.అభ్యుడు
89.రౌద్రకర్ముడు
90.దృఢరథుడు
91.అనదృష్యుడు
92.కుండభేది
93.విరావి
94.దీర్ఘలోచనుడు
95.దీర్ఘబాహువు
96.మహాబాహువు
97.వ్యూఢోరువు
98.కనకాంగదుడు
99.కుండజుడు
100 చిత్రకుడు
మరియు 
కుతురు
101. దుశ్శల
వీరుగాక దృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ యందు కలిగిన యుయుత్సుడు నూటొకటవ కుమారుడు.
మరొక కూతురు కూడా వుంది..( కాని ఆమె పేరు దొరకలేదు)
వీరంతా అతిరథులు,శూరులు,యుద్ధవిశారదులు, వేదవిదులు,శాస్త్రకోవిదులు,సంగ్రామ విద్యలో ప్రవీణులు,విద్య,వంశం చేత విరాజిల్లారు.
సేకరణ; డా. తిప్పభట్ల రామకృష్ణమూర్తి,డా. సూరం శ్రీనివాసరావు గార్ల వ్యాసభారతం నుంచి

కన్నీటి నివాళి

కన్నీటి నివాళి

కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
16.03.2014

పొ గడెద నిన్ను కలి రామాయని గ
ట్టి మేల్ తలపెట్టి భాషకు పట్టము గట్టి
'శ్రీ' లు నిస్సిగ్గుగ సిగ్గుపడేలా ప్రాణమర్పంచి 
రా ష్ట్రము తెచ్చితివేని.. ఆత్మగౌరవమ్ము చాటంగ
ము దిమి లెక్కించక యాబది ఎనిమిది దినములు ఆ-
లు బిడ్డలు గతించ లెక్కచూడక..రాష్ట్రము కై
అన్నపానము మాని .. అమరజీవివయ్యావయా..
దిక్కులు పిక్కటిల్లగా.. కన్నీరు వరదలవ్వగా
తెలుగు జాతి యావత్తు.. చేష్టలుడగగ...
నీదు త్యాగఫలముగ రాష్ట్రమవతరించె..
నీవు తిరిగిరాకు మహాశయా..!
నీ ఫలమిప్పుడే..ముక్కలాయెను
నిన్ను తలచిన నాధుడే కరువాయెను.
నీకిదే అమరేంద్రుడా...నా కైమోడ్పు
నీపాదములనర్చించ నా కన్నీళ్ళు చాలవెపుడూ
నీవె కదా జాతి యవత్తుకూ దార్శనికుడు.

 

(రాష్ట్రం విభజనకు గురైన అనంతరం వచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 113 వ జయంతి ని పురస్కరించుకుని.. వ్రాసినది... మొదటి అక్షరాలలో అమరజీవి పేరును ప్రస్తావించడం జరిగింది గమనించగలరు)

నువ్వంటే నాకు మనసవ్వదు

నువ్వంటే నాకు మనసవ్వదు

 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                                                        27.03.2014
కలికి చిలకల కొలికి..
తెలుగు పన్నీరు చిలికి
దగ్గరయ్యేరు కదా అందరికీ
ఆమె తేజం.. 
ఆమె నైజం..
ఆమె రూపం..
ఆమె హృదయం
ఆమె క్రోధం
ఆమె ఆశయం..
ముమ్మూర్తులా ఆమె..
అందరిలా లేరు..
ఎన్నాళ్ళ నిరీక్షణో..
ఆమె అడుగుల తాకిడికే
మురిసిన ప్రకృతి పరవశించె..
కొమ్మను విడిచిన లతాంగి 
అమె స్పర్శ కోసం తపించె
ఆమె కాలి అందెల సవ్వడికి 
సంబరపడి తోక పిట్ట చిందిలేసె
ఆమె మాటల సద్దుకు కొమ్మల్లో 
దాగున్న కోయిలమ్మ ప్రతిధ్వనించె..


అందాల బరిణె రాకకు...
చెట్లన్నీ ఒంగి స్వాగతం పలికె
కానాంతా కమ్మని సుగంధాలు పరిచె
ఎండిన జలపాతం.. ఆనంద భాష్పాలు రాల్చె..
నిశబ్ధం ఆవరించిన.. నిశీధిలో
ఉషాకిరణాలు చొచ్చుకునొచ్చి అమె స్పర్శించి తరించె
ముగ్గురమ్మలమూలపుటమ్మ .. పండగ సారె అందించె
ఒక్కపూటలో ఎంతటి పారవశ్యం...
ఒక్క ఝాములో ఎంతటి రమణీయం..
ఒక్క పొద్దులో ఎంతటి విలాసం..
అవును అడవమ్మ నవ్వింది.. అనందం పొంగగా..
కోయిలమ్మ పిలిచింది.. తలపు సంతసించగా..
ఎక్కడో నెమలి పురివిప్పి నాట్యమాడే వుంటుంది..
ఎందుకంటే అక్కడికి తరలి వచ్చె వసంతం తానై
హృదయాంతరాళలో గూడుకట్టుకున్న
ఏనాటి అనుబంధమో..
ఆమె వెనుదిరగగానే .. 
చల్లగాలి ఒక్కసారిగా నిలిచిపోయింది..
వనం మూగగా రోదించింది.
తోకపిట్ట రెక్క తెగినట్ట్లు విలవిల్లాడింది.
సూరీడు ఆవేదనతో నడినెత్తిన శివతాండవం మొదలెట్టాడు..
ఆమె ఓ అద్బుతం
సంగీత సాహిత్యాల సమరూపం
ఆమె ఓ వెన్నెల
వెలుతురు పంచే దివ్యరూపం
అమె నవ్వుల జలపాతం
చిరునవ్వులు చిలికించే సరోవరం
అమె తెలుగు చదువుల దేవాలయం
బీజాక్షరాలు లిఖించు వాగ్ధేవి రూపం
అమె వెనుదిరిగితె అడవే అల్లాడితే..
మా మనసులు పిక్కటిల్లవా..?
ఆ బాధ మా హృదయాన్ని పిండదా??
ఆ గాయం మా మదిని తొలచదా??
తెలుగు లేకుండా మమ్మూహింపగలరా??
అందుకే దైవమా నీవంటే నాకు మనసవ్వదు..
ఎక్కడ నుండి మరెక్కడికో.. 
ఇంతలో కలిపేవు.. అంతలోదూరం చేసేవు..
మనసులతో పరిహాసాలాడేవు..
మమతలను దూరంగా విసిరేవు..
స్నేహాన్ని క్షణభంగురం చేసేవు..
ఎందుకిలా..? ఏమిటి నీ లీలలు
మనుషులతో నీ క్రీడకు ఇకనైనా స్వస్తిపలకవూ..!!