// మా ఇంట్లో ఓ శంకర్ దాదా..//
- కె.కె. కృష్ణ కుమార్, 05.08.2015
ఎందరో మహానుభావులు అందరికీ వందనము... మా పెద్దోడు శ్రీరాంశరణ్ ఎంబిబిఎస్ చేరాడు.. ఒంగోలు లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో.. వారం రోజుల టెన్షన్.. ఒకరికి కాదు ఇద్దరికి కాదు.. ఇంటిల్లిపాదిదీ ఇదే పరిస్థితి.. కారణం లేకపోలేదు..
మొదట తెలంగాణా కౌన్సిలింగ్ జరిగింది గత నెల 29 న తేదీన. తెలంగాణాలో మావాడు నాన్-లోకల్.. ర్యాంకు 196 మాత్రమే.. ఉస్మానియా వస్తుందనుకున్నాం.. కనీసం గాంధీ మెడికల్ కాలేజ్‌కూడా రాలేదు.. వరంగల్ లో వచ్చింది.. కానీ.. మేము సానుకూలంగాలేక వరంగల్ వద్దనుకున్నాం.. నో-ఆప్షన్ పెట్టేశాం.. ఆ నిర్ణయం తప్పు కావచ్చని ఆ క్షణం మాకు తెలీదు..
ఆం.ప్ర లో లోకల్ ..ర్యాంకేమో 967..
ఈరోజున ( ఆగస్టు 5 న)ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలింగ్ కోసం ఏమౌతుందో తెలీక నానా ఇబ్బందీ పడ్డాం... సీట్ వస్తుందో రాదో అర్ధం కాని పరిస్థితి.. రిజర్వేషన్లు అన్నీ పోగా మిగిలిన వాటిలోనే రావాలని తెలిసి భయపడ్డాం.. లెక్కలు.. వగైరా లతో తల బొప్పి కట్టింది.. ఇక ఎదురుగా కౌంట్‌డౌన్ స్టార్ట్... ఒకొక్క సీటు ఐపోతూ.. భయపెట్టింది కంప్యూటర్ స్క్రీన్ ..
విశాఖ మేము లోనికి వెళ్ళకముందే పూర్తెపోయాయ్.. చూస్తుండగానే గుంటూరు, కాకినాడ, విజయవాడ సీట్లు హుష్ కాకి.. చివరకి గవర్నమెంట్ కాలేజీలో చేరాలన్న సంకల్పంతో ఒంగోలు రింస్ కాలేజీ లో చేరాడు శ్రీరాం..మావంశంలో రెండో డాక్టర్..

మా నాన్నగారి కల.. : మనుమడీని డాక్టర్ గా చూడాలన్నది, మా నాన్నగారు కరణం సుబ్బారావు గారి చిరకాల వాంఛ. ఇక ఆ వేటలో మా శ్రీరాం ఒంటరిగానే పోరాడాడని చెప్పాలి.. కేవలం మేము వాతావరణ కల్పించడం మినహా ఏమీ చేయలేదు.. ఇక ఎంట్రన్స్ సమయంలో .. భావరాజు పద్మిని గారు, వారి శ్రీవారు శ్రీ సతీష్ గారు బెంగులూరులో ఎంట్రన్స్ వ్రాయడానికి వెళ్ళినప్పుడు మాకు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి సహకరించారు.. వారికి ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు.. ఇక మాయింటికి రండి అంటూ కొల్లూరు విజయశర్మగారూ, రేఖ గారూ కూడా ఆహ్వానించినా దూరం అవ్వడం వల్ల మేము భావరాజు సతీష్ గారు ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని వినియోగించుకున్నాము.. కొల్లూరు విజయా శర్మ గారికి, Naveenrekha Ns మేడం గారికి కృతజ్ఞతలు.. ఇక సీట్ ల వేటలో సహకరించిన మా తమ్ముడి మామగారు శ్రీ ప్రసాద్ గారూ, మా ఫొటోగ్రాఫర్ మిత్రుడు శ్రీ శివరంజని సాయి (చీరాల)అన్నకు, మూర్తి గారు (ఆర్టిసి, ఒంగోలు )వారికి, మా శ్రీరాం స్నేహితుల పేరెంట్స్ అందరికీ పేరుపేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు..
ఇక మాఇంట్లో సంబరాలు చేసుకోవాలి.. ఇక్కడ ఎవరి ఫేరైనా చెప్పడం మరచిపోతే తిట్టకండే.. ఆనందంలో మరిచిపోయానని క్షమించేయండే...
ఇక పాటేస్కుంటాం మరి.." శ్రీరాం శరణ్ ఎంబిబిఎస్.. ఊ..హ..ఊ..హ"
ఇక పాటేస్కుంటాం మరి.." శ్రీరాం శరణ్ ఎంబిబిఎస్.. ఊ..హ..ఊ..హ"
శుభసాయంత్రం - మీ కరణం