Friday, 5 February 2016

//ఎందరో మహానుభావులు అందరికీ వందనము...//

//ఎందరో మహానుభావులు అందరికీ వందనము...//
              నేను అందరినీ ఇంటర్వూ చేసే ఒక మీడియా ప్రతినిధిని, ప్రకాశం జిల్లా జెమిని న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న నన్ను, మాలిక పత్రిక ఎడిటర్లలో ఒకరైన డా. సత్య గౌతమి గారు ఇంటర్వూ చేశారు.
హహహ..!
కొత్తగా ఉంది కదూ.. అవునండీ నిజమే.. !

              ఇటీవల ప్రకాశం జిల్లాలో మేము తీసి, మా జెమినిన్యూస్ చానల్ యాజమాన్యం ప్రసారం చేసిన "అమ్మ..నాన్న దూరమైతే..!" కథనానికి యునిసెఫ్ అవార్డ్ వరించింది.. ఈ అవార్డ్ ను రిపోర్టర్ గా నేను నాతో పాటూ, మా జెమినిన్యూస్ సబ్ ఎడిటర్ బెహరానందిని గారు కలిసి 2015 డిసెంబర్ పదవతేదీ హైద్రాబాద్ తాజ్ లో అందుకున్నాం..

            అగమ్యగోచరంగా మారుతున్న చిన్నారుల జీవితాలపై నేను అందించిన "అమ్మ నాన్న దూరమైతే..!" కథనం, యునిసెఫ్ అవార్డ్ గెలుచుకున్న సందర్భంలో డా. సత్య గౌతమి (యు.ఎస్.ఎ) వారు అబినందించేందుకు, నన్ను సంప్రదించి అనేక విషయాలపై నాతో చర్చించారు. ఆ చర్చ ఈ నెల మాలిక పత్రికలో ప్రచురించారు..
మిత్రులారా..!
వీలు చూసుకుని ఒకసారి నా ఇంటర్వూని చదివి మీ అమూల్యమైన సందేశాన్ని అక్కడే ఉన్న కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.. ఇంటర్వూ కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయగలరు.
                                                                                 - మీ కరణం


లింక్ :

http://magazine.maalika.org/2016/02/04/%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B1%80%E0%B0%B8%E0%B1%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%85%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%80%E0%B0%A4/





//కంటికి రెప్పవన్నారు..?//

//కంటికి రెప్పవన్నారు..?//
                            కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
                                       01.02.2016, 11.20


రెప్పలా కాచేవారన్నారు..
దీపానికి చేతుల్లా కాపాడేవారన్నారు..
ఇదా.. 
ఇదా
ఇదా.. 
మీ తల్లిదండ్రులు మీకు తాపిన ఉగ్గు..
సిగ్గు..సిగ్గు
ఇదీ మీ గురువులు మీకు నేర్పిన పాఠం.. 
వద్దు వద్దు..
బొడ్డుతో ముడిపడ్డ నీకు అమ్మ ఇచ్చిన రక్తమేది..?
చేయిపట్టుకు, నాన్న నేర్పిన అడుగుజాడల జాడలేవి..?
ఇదా బ్రతుకు..ఇదా నడత..
జాతి భవితకు వెలుగురేఖలన్నది మరచి..
రాబందుల రెక్కల దాగి ..
ఇదా బ్రతుకు ఇదా బ్రతుకు
సిగ్గు సిగ్గు

ఎవడికి వాడే గోరీ కడతారా..?
ఎవడి ఆస్తిని వాడే, అగ్నికీలల ఆహుతిస్తారా..?
ఎవరి తల్లిని వాడు చెరిచేస్తాడా..??
ఏ గ్రంధం వినిపించింది ఆగ్రహనాదం..? 
ఏ చరిత్ర చూపించిందీ విచ్చలవిడి మార్గం..?
ఎక్కడిదీ బ్రతుకు.. 
సిగ్గు సిగ్గు

పరిగెత్తే గర్భవతి నీ చెల్లేమో అనిపించదా..
వడివడిగా అడుగులేసె తాత చూడగ, మీ తాతలు గుర్తురాలా..??
గుండెలవిసి ఏడ్చే ఒడి బిడ్డ, మీ బిడ్డలా కనిపించదా..?
ఆటవికులం కాదు మనుషులం.. అదన్నా.. అసలు గుర్తుందా..?
ఇదా బ్రతుకు..ఇదా నడత...
సిగ్గు సిగ్గు

నిలువెత్తు భయపెట్టడమా ఉద్యమం..
ఆస్తుల విధ్వంసమా ఉద్యమం..
ఆప్తుల ఆర్తనాదాలా ఉద్యమం..
ఏ పుట.. నేర్పుతోందిరా మీకీ పాఠం.. 
ఏ పూటా తిండి లేని నీకెందుకురా ఉబలాటం..

దగ్ధమయ్యే ఆ ఇనుప చువ్వలకు ప్రాణముంటే..
మండే కీలలు, కళ్ళల్లో నింపుకుని ...
నీ గుండెలు చీల్చేవేమో..!
నీలో భయం పుట్టించేవేమో..!!
నీకు గుణపాఠం చూపేవేమో..!!!
                                  - కరణం
                                     

( రిజర్వేషన్ పేరుతో తుని లో రైలు దగ్ధం చేసిన క్షణాలు కలవరపరచి)