Saturday, 30 January 2016

ఒక్కలుక్కేయండి.. దేశంలో ఏం జరుగుతోందో..

ఒక్కలుక్కేయండి.. దేశంలో ఏం జరుగుతోందో..
                                                        - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
                                                                                  28.01.2016



హాట్స్ అఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి గారు!

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ నర్సింహారెడ్డి తీవ్రంగా స్పందించారు. "అక్బరుద్దీన్ మాట్లాడిన వీడియోలను నేను యూట్యూబ్‌లో చూశా. దారుణమైన వ్యాఖ్యలు ఉన్నాయి. రాముడి తల్లి ఎక్కడెక్కడ తిరిగి రాముడికి జన్మనిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధిక మంది ఆరాధించే భగవంతుడి విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అలాంటి మాటలు ఎలా అనగలిగారు? అరే హిందుస్థానీ అంటూ కూడా సంబోధించారు. మరి ఆయన ఉండేది ఎక్కడ? హిందుస్థాన్‌లో కాదా? 15 నిమిషాలపాటు పోలీసులను పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువుల అంతుచూస్తాడట..! నాకున్న పరిధి మేరకు పోలీసులను 15 నిమిషాలు కాదు అరగంటసేపు ఆపుతా. ఏం జరుగుతుందో చూస్తాం. అందరినీ చంపేస్తారా" అని ప్రశ్నించారు. ఆయనపై హత్యాయత్నం జరిగినప్పుడు కాపాడింది పోలీసులేనన్న సంగతిని మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. "ఆ ప్రసంగం ద్వారా అక్బరుద్దీన్ ఈ దేశానికే సవాలు విసిరాడు. ఆ సవాలుపైనే నిలబడమని చెప్పండి. దాని నుంచి వెనక్కి ఎందుకు తగ్గుతున్నట్లు? అక్బర్ ప్రశాంతంగా కూర్చొని ఆయన మాట్లాడిన వీడియోను చూడమని చెప్పండి. ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకుంటారు. ఈ దేశం నుంచి పోయేటప్పుడు చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌మినార్ తీసుకుపోతాడట. భారతదేశమంటే ఈ మూడేనా? ఈ మూడు లేకుంటే దేశం లేదా? ఈ దేశం ఆయన తండ్రిని ఎంపీని చేసింది. ఆయన సోదరుడినీ ఎంపీని చేసింది. ఆయన్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. మరి ఈ దేశానికి వారు ఇచ్చేది ఇదేనా? ప్రతి స్పందనకు ప్రతిస్పందన ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అక్బర్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కులమతాలకు అతీతంగా ప్రార్థించారు. ఆయన మాత్రం ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ముస్లింలదరూ ఆయన చెప్పిన దారిలో నడుస్తారని ఆయన భావిస్తున్నారా" అని ప్రశ్నించారు.

జస్టిస్ నర్సింహారెడ్డి గారు మొదటినుండి దమ్మున్న మనిషని నిరూపించుకుంటూనే ఉన్నారు. కరెక్ట్ గా కడిగారు అక్బరుద్దీన్ ని! ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ ధైర్యం చెయ్యనంత దుమ్ము దులిపారు. హాట్స్ అఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి గారు!

********************************************************************
I LOVE MY INDIA

అవును భారతదేశంలో ఉంటూ..భారతీయున కష్టఫలాలను పథకాల రూపంలో అనుభవిస్తూ.. భారతీయుల్లో అత్యధికులని మీరనే హిందువుల మనోభావాలను ఎందుకు కించపరుస్తున్నారు.... ఒకచచ్చినోడు వివేకానందుడీని దూషిస్తాడు.. మరొకడు మనువును ధూషిస్తాడు...

అంబేద్కర్ ఈ నాటి మనువైనప్పుడు.. మనువునెలా దూషిస్తారు..

ఆనాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా అప్పటి చట్టాలు ఆయన లిఖించారు.. ఇప్పటి సామాజిక పరిస్థితులు అవసరతల దృష్ట్యా అంబేద్కర్ చట్టాలు చేశారు.. మా అందరి దృష్టిలో అంబేద్కర్ అభినవ మనువు... చెవుల్లో సీసం పోసుకున్న మీకు అది అర్ధం కాదు...    


అయినా అక్భరుద్దీన్ ..అంత అంత కూతలు కూసినా నాలిక కోయకుండా మూసుకుని కూర్చున్నారంటే.. నీకో నీ వారికో భయపడి కాదు... కేవలం హిందువుల రక్తంలోని సహనం వల్లే...తెలుస్కో..

ప్రపంచమే మోకరిల్లే వివేకానందుని దూషించిన వాడినీ క్షమించారంటే..చేతకాక గాదు కేవలం చట్టాల పని చట్టం చేసుకుపోతుందని అంబేద్కర్ వ్రాసిన చట్టాలను గౌరవించి మాత్రమే...

పరమత సహనం చచ్చిపోయిన వాళ్ళూ... దేశభక్తి లేని వాళ్ళూ దేశం విడిచి పోండి...

నా దేశంలో మేమంతా కలిసే తిరుగుతున్నాం.. కలిసే తింటున్నాం.. కలిసే బ్రతుకుతున్నాం... అతడు క్రైస్తవుడా .. ముస్లిమా..అనే బేధాలు మేమెప్పుడో మరచిపోయాం.. మమ్మల్ని విడదీసే ప్రయత్నాలు మానుకోండీ... శవాల దగ్గర మరమరాలుశేరుకోవటానికి స్వస్తి పలకండి...

నాదొక చిన్న అనుమానం మేం కలసి ఉండటం మీకెందుకు కంటకింపో అర్ధం కావట్లేదు... మొన్నటి దాకా వేరు చేశారని అన్నారు.. మరి కలిసి పెరుగుతుంటే మీ కొచ్చే నష్టం ఏవిటీ...

నావరకూ చెప్పాలంటే ...
 దళితులు అన్న వారే నాకెక్కువ మిత్రులు..."ఏరా కరణం" అనే చనువున్న 'కబ్బడు' కూడా నా మిత్రుడే.. రూఫస్ దంపతులు మా ఇంట్లో ప్రతి. కార్యక్రమంలో ఉండాల్సిందే.. ..

ఏలియా... బాబూ, లిక్కడు, రవి ..దిలీపులు ...జాజబాబు.. ఇలా ఎందరో నాతో కలిసో ..నేను వారితో కలిసే తిరిగాం. తిరుగుతున్నాం.. వారిళ్ళలో ఫంక్షన్ లకు మా ఇంటికి వచ్చి పిలుస్తారు.. డా.కోటేశ్వరరావు అంకుల్. కుటుంబం మా ఇంటిలో వారే... నాతోనే ఉండే మట్టిలోని మాణిక్యం.

ఎల్లైసీలో పనిచేసిన రఫీ కుటుంబం మా ఇంట్లో పదేళ్ళు అద్దెకున్నారు.. వారి పిల్లలు మా పిల్లలతో కలిసి పెరిగారు.. నాలుగంగళాల గోడ మాత్రమే అడ్డు... మాకు మాంసం వాసన పడదని వారు మాంసం బయట  తినే వారు.
మా ఇంట్లో శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంటే వారు పుట్టింటి వారిలా చీరె సారెశపెట్టే వారు...

ఉదయాన్నే బాపట్ల ఆలీ బాబాయ్ కాల్ చెయ్యక పోతే.. నేను ఇంట్లోంచే కదలను...

 మతమంటే ప్రాణంగా భావించే బాష..నేను ఖురాన్ .. గీతల పై మంచి గురించి షేర్ చేసుకుంటుంటాం..
అంతెందుకు నాకు ఊహ తెలిసే సరికే మా పల్లెటూర్లో మా ఇంటి ప్రాంగణంలో బిబి ఉండేది.. మా బామ్మ గారి చివరి క్షణాల వరకు బిబి దగ్గరే ఉంది..

శ్రీరంగం ఆస్థాన విద్వాంసులు మహబూబ్ సుభాని, కాలేషా బీలను మేము బాబాయ్ పిన్ని అనే పిలుస్తాము...

నేను రూఫస్ ఒకే బ్లడ్ గ్రూప్ ఇద్దరం కలిసి చాలా మందికి రక్తదానం చేశాం వారందరిలో మా ఇద్దరి రక్తం కలిసే ప్రవహిస్తోంది... రూఫస్ తల్లి గారు , తండ్రీ గారు మంచిమతబోధకులు... వారిని వారి మతాన్ని మేంగౌరవిస్తాం మా మతానికి వారు విలువ నిస్తారు...

తల్లి గారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా రక్తం ఆమెకి ఎక్కించారు..అంటే వారిలో నా రక్తం మిళితమయ్యే ఉంది.

నేను చదువుకునేటప్పుడు బందర్ లో నా రూం మేట్స్ విషయం ఇక్కడ ఖచ్చితంగా చెప్పి తీరాలి.. అలందర్ హుస్సేన్ (తాడేపల్లిగూడెం), బెనర్జీ (విశాఖపట్నం) నా రూం మేట్స్.. తలా ఒక బ్రాంచ్ కూడా.! కలిసే రెండేళ్ళు ఉన్నాం ఒకే రూంలో.

ఇలాంటివి చెప్పాలంటే కో కొల్లలు....

మా అమ్మగారూ నాన్నగారు మమ్మల్ని అలా పెంచారంటే వారి తరం ఇంకెంత గొప్పదో కదా...

ఇదంతా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కాదు వాస్తవం ..

ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే...

ఖచ్చితంగా మేమైతే మారాం..మీరే ఇంకా మానసికంగా నూతిలోనే ఉన్నట్లున్నారు.. మీరు ఎదిగి ఉన్నతులవుతున్నారని మేం భావిస్తున్నాం.. మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారని నేను బల్లగుద్ది చెబుతున్నా..!

    పూర్వం మనందరి ఐకమత్యం ని ఎవడైతే తమ రాజకీయాల కోసం వాడుకున్నారో అలాంటి వారే మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు..

ఇప్పుడు చెప్పండి ఇది నా ప్రశ్నే కాదు నాలాంటి భావాలున్న కోట్ల మంది ప్రశ్నలు..

1. అసలు మమ్మల్ని కులమతాలకు అతీతంగా కలసి సమానంగా మనుగడ సాగించమంటారా లేదా...?

2. హిందువుల విషయంలో అత్యధికుల పేరుతో టామింగ్ పై దృష్టి పెట్టే మీడియా.. అక్బరుద్దీన్ ని స్టూడియోలో కూర్చో బెట్టి సవాల్ ఎందుకు విసరట్లేదు..? హిందువులకి మనోభావాలుండవా?

3. విద్యార్ధి మృతి చెందితే అతడి ముందు దళిత పదం మీడియా వాడటం ఎంత వరకూ సబబు... ఇది అంతర్గత లా అండ్ ఆర్డర్ మత విద్వేషాలు రెచ్చగొట్టే క్రియ కాదా...? వీరికి చట్టం పై గౌరవం ఉందా లేదా..?

4. మనువు వ్రాసిన ధర్మశాస్త్రాన్ని దగ్ధం చేస్తుంటే పోలీసులు ఎందుకు పుర్తిస్తాయిలో చర్య తీసుకోలేదు..? అదే ఇతర మతాల ధర్మశాస్తాల ను ఏవైనా అంటే పోలీసులు చర్య తీసుకోకుండా ఉంటారా??

5. పేరుకి , సర్టిఫికెట్లకి పథకాల సొమ్ములకి కావల్సిన హిందూ మతం... పక్కన నడిచి వెళ్ళడానికి ఎందుకు ఏహ్యం??

6.. సహనం చచ్చిన ఓ మేధావుల్లారా మీకు ఇవన్నీ ఎందుకు కనిపించటంలేదు...??

7.. మేముకలసి మెలసి జీవిస్తే మీకు భయమేస్తోంది కదూ..
అందుకేనా ఓట్ల కోసం విడదీయటం... ఆనక వదిలేయటం...??

8. దేశం అంటే ఇష్టం లేని వారు దేశం విడిచి వెళ్ళొచ్చు కదా...ఏ ఎందుకు చేయరు.. ఆస్తులు పోతాయనా..? అక్కడైతే చెమ్మ తీస్తారని భయమా..?

9. మత విద్వేషపు  ప్రచారం..ప్రసారం.. ప్రకటనలపై   బలమైన చట్టం రూపొందిస్తారా.. లేదా..?

10.ఇంతకీ నాలాంటి భావాల వారిని ఏంచేయమంటారు..?

నేను కోరుకునేది అంబేద్కర్ ఆశయ సాధన.. అందరూ సమానమే అనే గొప్ప భావన...అందుకోసం అందరం ఐకమత్యం గా ముందుకు సాగటం...
భారత్ మాత కి జై...
జై హింద్
_ మీ కరణం


Saturday, 23 January 2016

// న్యూ వర్ల్డ్ ...//

// న్యూ వర్ల్డ్ ...//
             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
                          21.01.2016.. 16.11  


కొత్త ప్రపంచం..కొత్త ప్రపంచం..
ఆశల వలయాల ఆవల..
ఈర్ష్యాద్వేషాలకు సుదూరాన.. 
నాలో నీవు నీలో నేనూ..
కవ్విస్తూ..మురిపిస్తూ..
మెత్తగా హత్తుకుని..
ఆ గాఢ పరిష్వగంలో
మైమరమరచి..
ఏకాకుల్లా ఏకమై.. 

ఎడారి ఒయాసిస్సు ఒడ్డున
అడుగులో అడుగేసుకుంటూ..
మంచు శిఖర చిటారు కొనపై..
ఊసులాడుకుంటూ..
శంబరమాటున మెరిసిపోతూ
శరధి నురుగై తేలిపోతూ ..
కరిగిపోతూ ..కలిసి పోతూ...
సవ్వడి ఎరుగని చీకటిలో..
కిరణం సంయోగించని చిట్టడవిలో..

ఒకరికొకరం ..
ఒకరై ఇద్దరం...
 చలించి జ్వలించి .. 
కేళీ విలాసాన
విజయపుటంచుల కేతనం ఎగురేయాలి...
కొంగ్రత్త ప్రపంచపు ఆది మనమవ్వాలి...
అంతవరకూ...నీవు నాతో ఉంటావు కదూ..
యు ఆర్ మై న్యూ వర్ల్డ్. 
లవ్యూ ఫరెవర్..._ నీ కరణం...
                                              21.01.2016.. 16.11

(చిత్రం గీసిన మహానుభావుడికి శిరస్సు వంచి నమస్సులతో.. గుగూల్ నుంచి..!! 
కవితకు చిత్రం వెదకటంలో సహకరించిన నా ప్రాణ మిత్రులకు కృతజ్ఞలతో..!- కరణం )